ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా రూలర్ రేపు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలకృష్ణ మూడు రకాల విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా సోనాల్ చౌహన్, వేదిక నటిస్తున్నారు. గత ఏడాది బాలయ్యకు జైసింహా వంటి సక్సెస్ఫుల్ సినిమాని అందించిన కేఎస్ రవికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ మరియు థియేట్రికల్ ట్రైలర్ కు నందమూరి ఫ్యాన్స్, ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. 

 

అయితే ట్రైలర్ లో బాలయ్యను చూస్తే అందరిలో ఒక అనుమానం మాత్రం వస్తుంది. చూడడానికి ఎంతో అందంగా ఉండే ఆయనకు, ఈ సినిమాలో పోలీస్ గెటప్ లో సరైన విగ్ ని పెట్టలేదు అని అర్ధం అవుతుంది. మరోవైపు కోలీవుడ్ సూపర్ స్టార్ రజిని కాంత్ కూడా విగ్ తోనే సినిమాల్లో నటిస్తున్నప్పటికీ, తన సినిమాల్లో వాటితో ఎంతో స్టైలిష్ గా కనపడుతుంటారు రజని. మరి బాలయ్య కూడా అలా చూడచక్కని విగ్స్ పెట్టుకోకుండా, చూడడానికి ఇబ్బందికరంగా ఉండే విగ్స్ ఎందుకు వాడుతున్నారు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్న వారు కూడా లేకపోలేదు. మరి ఈ విషయం బాలయ్య వరకు వెళ్ళినట్లైతే, 

 

తప్పకుండా ఆయన తమ ఈ మనవిని స్వీకరించి ఇకపై ఇటువంటి విగ్స్ ధరించరని కోరుకుంటున్నట్లు పలువురు నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా పలు కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తుండగా, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరి అందరిలోనూ ఎన్నో అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా రేపు రిలీజ్ తరువాత వాటిని ఎంతవరకు అందుకుని ముందుకు సాగుతుందో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: