గత వారమ్ విదుదలైన "వెంకీమామ" బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతుంది. సినిమాకి రివ్యూల పరంగా నెగెటివ్ గా వచ్చినప్పటికీ ప్రేక్షకులని అమితంగా ఆకర్షిస్తోంది. విక్టరీ వెంకటేష్ నటనతో పాటు, కామెడీ టైమింగ్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్ళాయి. సినిమాలో వెంకటేష్ తో పాటు నాగచైతన్య ఉన్నప్పటికీ ఎక్కువ భాగం వెంకీనే లాగుకొస్తున్నాడు. తనకి అచ్చొచ్చిన కామెడీని తనదైన శైలిలో పండించి వావ్ అనిపించుకున్నాడు.

 

 

ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొన్నటికి మొన్న సూపర్ స్టార్ మహేష్ వెంకీమామ చాలా బాగుందని సినిమా ఆద్యంతం నవ్వుతూనే ఉన్నానని చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ సైతం వెంకీమామ గురించి మాట్లాడడం జరిగింది. వెంకీ మామ చిత్రం పై ప్రసంశలు కురిపిస్తూ మెగాస్టార్ ఓ వీడియో చేశారు. వెంకీ మామ చిత్రం చూసిన మెగాస్టార్ ఆద్యంతం ఎంజాయ్ చేశారట. 

 

 

ముఖ్యంగా వెంకటేష్ తన మార్కు కామెడీ టైమింగ్, యాక్షన్ అండ్ ఎమోషన్స్ కురిపించాడన్నారు. అలాగే నాగ చైతన్య మెట్యూర్డ్ యాక్టింగ్ తో మూవీ విజయంలో కీలక పాత్ర పోషించారు అన్నారు.  అలాగే వెంకీ మామా కి దర్శకత్వం వహించిన బాబీ ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. బాబీ టేకింగ్, సినిమాని ఆసక్తిగా నడిపించిన విధానం చాలా బాగుందని, మీరు వెళ్ళి సినిమా చూడండని, సినిమా అందరికీ చాలా నచ్చుతుందని తెలిపారు.

 

 

వెంకీ మామా సినిమాకి పోటీగా రేపు బాక్సాఫీసు వద్ద రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. బాలయ్య గారి రూలర్ సినిమా, సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజు పండగే సినిమాలు రేపు విడుదల అవుతున్నాయి. మరి ఈ రెండు పెద్ద సినిమాల తాకిడిని తట్టుకుని వెంకీమామ ఏ మేరకు నిలబడగలడు అనేది ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: