బాలయ్య రూలర్ గా విజృంభించడానికి ఇంకా కేవలం గంటల వ్యవధి మాత్రమే మిగిలివుంది. బాల‌య్య కెరీర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 105వ సినిమాగా తెర‌కెక్కిన రూల‌ర్ ఈ శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. బాల‌య్య అంటేనే సెంటిమెంట్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఈ క్ర‌మంలోనే త‌న ప్ర‌తి సినిమా షూటింగ్ ప్రారంభోత్స‌వం, కంప్లీట్ నుంచి చివ‌ర‌కు రిలీజ్ డేట్‌, ఫ‌స్ట్ షో ఇలా అన్ని ముహూర్తం చేసుకుని రిలీజ్ చేస్తుంటారు.

 

ఈ క్ర‌మంలోనే రూల‌ర్ షోకు కూడా బాల‌య్య ముహూర్తం పెట్టేశాడు. బాలయ్య రేపటి ఉదయం ఆటకు కూడా ముహూర్తం ప‌క్కాగా ఫిక్స్ చేశారు. ఈ టైమింగ్ ప్ర‌కార‌మే ఫ‌స్ట్ షో ప‌డుతుంది. బాల‌య్య పెట్టిన‌ మేరకు రూలర్ మూవీ రేపు ఉదయం 8:33 నిమిషాలకు మొదటి షో పడనుంది. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే టైమింగ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

 

మ‌రి ఈ ముహూర్తం ప్ర‌కారం చూసుకుంటే ఈ రాత్రికి రూలర్ ప్రీమియర్ షోస్ కూడా ఉండకపోవచ్చు. మ‌రి ఈ ముహూర్తం ప్ర‌కారం అర్ధ‌రాత్రే ఫ్యాన్స్ ప్రీమియ‌ర్ల‌తో ఎంజాయ్ చేయాల‌నుకుంటే అది కుద‌ర‌దు. షో బాల‌య్య ఫ్యాన్స్‌కు పెద్ద షాకే ఇచ్చారు. హ్యాపీ మూవీస్ ప‌తాకంపై సీనియ‌ర్ నిర్మాత సీ క‌ళ్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు కోలీవుడ్ సీనియర్ దర్శకుడు కె ఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

 

గత ఏడాది వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జై సింహ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తుండగా వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలయ్య రెండు భిన్నమైన పాత్రలు చేస్తున్న రూలర్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక రూలర్ చిత్రానికి సంగీతం చిరంతన్ భట్ అందించారు. మ‌రి రూల‌ర్ గా బాల‌య్య ఎలా గ‌ర్జిస్తాడో ?  మ‌రి కొద్ది గంట‌ల్లోనే తేలిపోనుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: