కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో బాలయ్య బాబు నటించిన ‘రూల‌ర్‌’ సినిమా మరి కొద్ది గంటల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు అదరగొట్టే రీతిలో సినిమా యూనిట్ చేయడం జరిగింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ కార్యక్రమం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు ‘రూల‌ర్‌’ సినిమాకి యు బై ఏ స‌ర్టిఫికెట్ ఖరారు చేసింది. సినిమా నిడివి దాదాపు రెండున్నర గంటలు ఉంటున్నట్లు అంతేకాకుండా సినిమాల్లో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలకు డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ ప్రాధాన్యత ఇచ్చినట్లు ఇండస్ట్రీ నుండి వినబడుతున్న టాక్. ఈ సినిమాలో దాదాపు బాలయ్య బాబు నాయుడు అదరగొట్టే ఫైట్ చేసినట్లు మాస్ రాక్షసులను టార్గెట్ చేసుకుని సినిమా రూపొందించినట్లు ఖచ్చితంగా సినిమా స్టోరీ చాలా వైవిధ్యంగా తెరకెక్కించినట్లు బాలయ్య శైలిలో ఫైట్లు అదరగొట్టే రీతిలో రక్తపాతం మరియు హింస ఎక్కువగా పోరాట సన్నివేశాలలో ఉండేటట్లు కేఎస్ రవికుమార్ సినిమాని తెరకెక్కించారు అని వార్తలు వినబడుతున్నాయి.

 

ఇటువంటి నేపథ్యంలో సినిమాకి సంబంధించి ఒక వైరల్ వారితో తాజాగా బయటకు వచ్చింది. అదేమిటంటే సినిమా కేవలం మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీసినట్లు ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తే మధ్యలోనే సినిమా హాల్లో నుండి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు సినిమా కుటుంబ ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చదని చాలా బలంగా సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి.

 

దీంతో ఈ వార్త పై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుందని కచ్చితంగా ఇది పక్కా మాస్ సినిమా అంటే ‘రూల‌ర్‌’ పై నెటిజన్లు డైలాగ్ లు వేస్తున్నారు. దాదాపు రెండు సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు చాలా పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. ఇటువంటి తరుణంలో తాజాగా ఈ వార్త బయటకు రావడంతో ఈ సినిమా విడుదలకు ముందే కొంత నిరుత్సాహం లో ఫ్యాన్స్ ఉన్నట్లు సమాచారం.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: