'బాహుబలి' లాంటి ఇంటర్నేషనల్ హిట్ సినిమా తర్వాత అంతర్జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ క్రియేట్ అయిన తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న rrr సినిమాపై దేశ వ్యాప్తంగా తో పాటు అంతర్జాతీయ స్థాయిలో  మంచి క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో ఇద్దరు టాప్ హీరోలు అయినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం కలిసి నటిస్తున్న నేపథ్యంలో సౌత్ ఇండియాలో ఈ సినిమా అతిపెద్ద మల్టీస్టారర్ సినిమాగా ఇప్పటికే పేరు తెచ్చుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా విశాఖపట్టణం పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సినిమా ప్రారంభించిన సందర్భంలో డైరెక్టర్ రాజమౌళి ఫోకస్ అంతా రామ్ చరణ్ పై పెట్టి సినిమా చాలా వరకు చాలా ఫాస్ట్ గా తీయగా… ఎన్టీఆర్ కి సినిమాలో హీరోయిన్ దొరక్కపోవడంతో మొన్నటి వరకు వదిలేసిన రాజమౌళి తాజాగా హీరోయిన్ దొరకటంతో చరణ్ ని వదిలేసి తారక్ ను పట్టుకున్నారని సమాచారం.

 

దాదాపు సినిమాలో రామ్ చరణ్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం క్యారెక్టర్ చేస్తున్నారు. పీరియాడిక్ కథకు కాల్పనికత జోడించి రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతో ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయాల్సిన షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయడానికి పక్కా షెడ్యూల్ ఖరారు చేశారని సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం.

 

ప్రస్తుతం 'RRR' సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం అవార్డు వేడుకల్లో అలాగే సల్మాన్ ఖాన్ నటించిన  దబాంగ్ 3 సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొని ఎంజాయ్ చేస్తున్నారు. రాజమౌళి చెప్పిన తేదీ ప్రకారం అనగా వచ్చే ఏడాది జులై చివరి వారంలో ఎలాగైనా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో సినిమాకి సంబంధించి షూటింగ్ విషయంలో పక్కా షెడ్యూల్ తో రాజమౌళి ప్రస్తుతం షూటింగ్ జరుపుతున్నట్లు ఫిలింనగర్లో వినబడుతున్న టాక్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: