అప్పట్లో చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న సందర్భంలో ఎక్కువగా డైరెక్టర్ కోదండ రామిరెడ్డి సినిమాలు చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించడం జరిగింది. చిరంజీవి కెరీర్ గమనిస్తే దాదాపు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చేసిన సినిమాలు చిరంజీవి కి మంచి పేరు తీసుకొచ్చాయి. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం కోదండరామిరెడ్డి సినిమాలు నుండి విరమించుకుని తన కొడుకుతో సినిమా ఎంట్రీ చేపించి మొదటిలో విజయాలు సాధించిన తర్వాత ఆయన కొడుకు పెద్దగా ఇండస్ట్రీలో కెరీర్ సాగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.

 

ఇటువంటి తరుణంలో తాజాగా కోదండరామిరెడ్డి ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ గురించి మరియు తన వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చిన కోదండరామిరెడ్డి … ఎన్టీఆర్ గురించి ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఆయన ఏమన్నారంటే..” ఏఎన్నార్ తో దాదాపు ఆరు సినిమాలు చేయడం జరిగిందని. కానీ సీనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు చేయలేకపోయా… అంతే కాకుండా ఆయన పిలిచి మరీ అవకాశాలు ఇచ్చారు కూడా అంటూ… తమిళంలో శివాజీ గణేశన్ చేసిన ఒక సినిమాను తెలుగులో చేయమన్నారు.

 

అయితే తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథను మార్చడానికి చాలా సమయం పడుతుందని చెప్పాను. అందువలన ఆ ప్రాజెక్టు పక్కకి పోయింది. ఆ తరువాత మరో సినిమా చేసే అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో బిజీగా ఉండటం వలన చేయలేకపోయాను. ఎన్టీ రామారావుగారితో సినిమా చేస్తే అదో రికార్డుగా వుంటుందనే ఆలోచన కూడా అప్పుడు నాకు రాకపోవడం బాధను కలిగిస్తుంది. ఆయనతో సినిమా చేయలేకపోవడం నిజంగా దురదృష్టమే" అని చెప్పుకొచ్చారు. ఇదే కార్యక్రమంలో ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సమస్యల గురించి అనేక సినిమాల షూటింగ్ విశేషాలు గురించి భవిష్యత్తులో చేయబోతున్న కార్యక్రమాల గురించి కోదండరామిరెడ్డి ఈ కార్యక్రమంలో తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: