సంక్రాంతి టార్గెట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమాలు ఒక రోజు గ్యాప్ లో విడుదల కాబోతున్నాయి. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో బయట వాతావరణం బన్నీ వర్సెస్ మహేష్ అన్నట్టుగా ఉండటంతో ఇద్దరు హీరోల అభిమానులు ఛాలెంజ్ పైన ఛాలెంజ్ వేసుకుంటూ రగడ సృష్టిస్తున్నారు. ఇద్దరి హీరోల టార్గెట్ ఒకటే హ్యాట్రిక్. విషయంలోకి వెళితే సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలు ‘భరత్ అనే నేను’ మరియు ‘మహర్షి’ లాంటి రెండు బ్లాక్ బస్టర్ వరుసగా  బాక్సాఫీస్ దగ్గర పడటంతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టడానికి మహేష్ రెడీ అవుతున్నాడు.

 

సినిమా స్టోరీ మరియు కామెడీ కమర్షియల్ ఎలిమెంట్ విషయంలో వెనక్కి తిరిగి చూసుకునే పని లేదని ఖచ్చితంగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రాబోయే సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్ అవ్వడం గ్యారెంటీ అని టాక్ ఇండస్ట్రీలో బలంగా వినబడుతుంది. ఇదే తరుణంలో అల్లు అర్జున్ కూడా హ్యాట్రిక్ మంత్రాన్ని జపిస్తున్నారు. మేటర్ ఏమిటంటే 'అలా వైకుంఠపురం లో' సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కింది. దీంతో గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో 'అలా వైకుంఠపురం లో' సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని త్రివిక్రమ్ అల్లుఅర్జున్ ఆలోచిస్తున్నారు.

 

అయితే ఈ రెండు సినిమాలు సంక్రాంతి పోటీగా వస్తున్న తరుణంలో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న వాతావరణం ప్రకారం సినిమా స్టోరీ పరంగా మరియు కామెడీ పరంగా 'సరిలేరు నీకెవ్వరు' స్ట్రాంగ్ గా ఉండగా డాన్సుల పరంగా మరియు పాటల పరంగా 'అల వైకుంఠ పురంబులో' సినిమా ముందంజలో ఉందని ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు కామెంట్ చేస్తున్నారు. దీంతో అన్నిటిలో మహేష్ దే గెలుపు ఉండగా పాటలు మరియు డాన్స్ ఆ ఒక్క విషయంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బన్నీ మందు అట్టర్ ఫ్లాప్ గా సంక్రాంతి బరిలో మిగిలిపోతుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: