కోలీవుడ్ లో సూర్య తమ్ముడిగా తమిళ ఇండస్ట్రీకి పరిచయమైన కార్తి ఆ తర్వాత అన్న ఇమేజ్ ని డామినేట్ చేసే విధంగా ఎదిగాడు. వరుసగా సూపర్ హిట్స్ ని అందుకొని సూర్య కే పోటీగా నిలబడ్డాడు కార్తి. అయితే గతకొంతకాలంగా సూర్య ని ఫ్లాప్స్ బాగా ఇరకాటంలో పడేశాయి. దాంతో టాలీవుడ్ లో మార్కెట్ బాగా తగ్గిపోయింది. కానీ కార్తి మాత్రం రీసెంట్‌గా ఖైదీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.తెలుగులో కూడా ఈ సినిమా మంచి వసూళ్ళని రాబట్టుకుంది. దాంతో కార్తి నెక్స్ట్ సినిమా మీద అటు కోలీవుడ్ , ఇటు టాలీవుడ్ లో బాగానే అంచనాలు ఉన్నాయి. అయితే కార్తి మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తూ అందరికి షాకిస్తున్నాడు. 

 

ఒక సినిమా మంచి కమర్షియల్ సక్సస్ సాధించాలంటే చాలా కారణాలు ఉంటాయి. ప్రేక్షకులను మెప్పించే కథా కథనాలు.. పాటలు.. స్టార్ హీరోలు.. రిలీజ్ టైమింగ్ లాంటి అంశాలు చాలా ఉంటాయన్న సంగతి తెలిసిందే.  అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక సినిమాకు ప్రేక్షకులను చేరువ చేసేది మాత్రం పబ్లిసిటీనే. అది సంప్రదాయ పద్దతిలో చేసే ప్రచారం అయినా కావొచ్చు.. లేదా ఆధునిక పద్దతుల్లో చేసే సోషల్ మీడియా ప్రచారం అయినా కావొచ్చు. 

 

అయితే కొందరు ఫిలిం మేకర్స్ మాత్రం ప్రచారం కోసం డబ్బు ఖర్చు పెట్టడం దండగ అనే ఆలోచనలోకి వచ్చేశారు. అలాగే ఫిక్స్ అయిపోయి తమ సినిమాకు తమకు తోచిన రీతిలో సినిమాను రిలీజ్ చేస్తారు.  అయితే అందరూ రామ్ గోపాల్ వర్మ తరహాలో పైసా ఖర్చులేకుండా భారీ ప్రచారం చెయ్యగలిగే సత్తా మాత్రం ఉండదు. అయన ఫార్ములా, ట్రీట్ మెంట్ కంప్లీట్ గా డిఫ్రెంట్. ఆయన స్టైల్ ఫాలో కావడం చాలా కష్టం. ఇక డిసెంబర్ 20 న నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. వీటిలో రెండు స్ట్రెయిట్ సినిమాలు. నందమూరి బాలకృష్ణ 'రూలర్'.. సాయి ధరమ్ తేజ్ 'ప్రతిరోజూ పండగే'. మిగిలిన రెండేమో డబ్బింగ్ సినిమాలు.. సల్మాన్ ఖాన్ 'దబాంగ్ 3'..  కార్తి 'దొంగ'. 

 

ఈ నాలుగు సినిమాలలో మూడు సినిమాల కు ఏదో ఒక రూపంలో ప్రచారం జోరుగానే సాగుతోంది. కానీ కార్తి 'దొంగ' సినిమా సందడి మాత్రం లేనే లేదు.  కార్తి ఈమధ్యే 'ఖైది' సినిమాతో హిట్ సాధించాడు. కలెక్షన్స్ మాత్రమే కాకుండా సినిమాకు మంచి పేరు కూడా వచ్చింది.  ఇలాంటి సినిమా తర్వాత కార్తి సినిమా రిలీజ్ అవుతుందంటే కనీసం అంతో ఇంతో పబ్లిసిటీ ఉండాలి కదా. అది కూడా కనిపించడం లేదు. 'దొంగ' సినిమా రిలీజ్ చేస్తున్న నిర్మాతలు కూడా ఇవేవీ పట్టించుకోవడం లేదట. కార్తి కూడా ఈ విషయం గ్రహించి నిర్మాతలను కనీసం అవుట్ డోర్ పబ్లిసిటీ కూడా చేయకపోతే ఎలా అని అడుగుతున్నాడట. టైటిల్ కి తగ్గట్టే ఇలా గుట్టుచప్పుడు కాకుండా వస్తున్న ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందోనని ఇప్పుడు కార్తి ఫ్యాన్స్ అనుకుంటున్నారట. ఇకపోతే కార్తి తన సినిమాలకు పెట్టుకున్న రెండు టైటిళ్ళు గతంలో చిరంజీవి నటించిన సినిమా టైటిళ్ళు కావడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: