టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా, సమర్పకుడిగా చాలా సినిమాలకు వ్యవహరించాడు. దిల్ రాజు సమర్పించిన సినిమా లేదంటే దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ లో వచ్చిన సినిమా అంటే ప్రేక్షకుల్లో ఆ ప్రాజెక్ట్ పై పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. అందుకే పలు చిన్న సినిమాల నిర్మాతలు తమ సినిమాలను దిల్ రాజు బ్యానర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటుంటారు. డబ్బింగ్ సినిమాలను కూడా దిల్ రాజు తన బ్యానర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఆ సినిమాలు కూడా బాగానే సక్సస్ అయ్యాయి. 

 

అలానే ఇప్పుడు మరో డబ్బింగ్ సినిమాతో దిల్ రాజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో రాబోతున్న దిల్ రాజు అంతకు ముందే అంటే జనవరి 1నే 'అతడే శ్రీమన్నారాయణ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను సౌత్ లోని అన్ని భాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేయబోతున్నారు. కేజీఎఫ్ తర్వాత కన్నడ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి తో పాటు అంచనాలు భారీగా పెరిగాయి. అందుకే ఈ సినిమాను తెలుగులో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

 

ఇప్పటికే విడుదలైన 'అతడే శ్రీమన్నారాయణ' సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. కేజీఎఫ్ తర్వాత కన్నడ లో మరో సంచలన చిత్రంగా అతడే శ్రీమన్నారాయణ సినిమా నిలుస్తుందంటూ కన్నడ సినీ వర్గాల వారు చాలా నమ్మకంగా చెబుతున్నారు. అందుకే ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చాడు. తెలుగు రైట్స్ దక్కంచుకున్న దిల్ రాజు జనవరి 1న తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి కొత్త సంవత్సరంను డబ్బింగ్ సినిమాతో మొదలు పెట్టబోతున్న దిల్ రాజుకు ఈ సినిమా ఎలాంటి సక్సస్ ను అందిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ సినిమాతో దిల్ రాజును వెంట బెట్టుకుని తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న రక్షిత్ కు ఎలాంటి ఇమేజ్ వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: