మల్టీ స్టారర్ సినిమాలంటే బాలీవుడ్ లో చూడాలి. అక్కడ తెరకెక్కించే మల్టీ స్టారర్ సినిమాలలో కంటెంట్ మహా అద్భుతంగా ఉంటుంది. సూపర్బ్ అనిపించే యాక్షన్ ఘట్టాలు ఉంటాయి. అసలు బాలీవుడ్ లో మల్టీ స్టారర్ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇక మన తెలుగు సినిమాలలో కూడా మల్టీ స్టారర్ సినిమాలు ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ కాలంలో వచ్చి సూపర్ హిట్స్ ని అందుకున్నాయి. కానీ ఆ తర్వాత మాత్రం మల్టీ స్టారర్ లు లేవనే చెప్పాలి. ఇక ఆ తర్వాత వచ్చినా తెలుగునాట హిట్ అయిన మల్టీ స్టారర్ లు చాలా తక్కువ. మన హీరోలు పైకి ఎన్ని మాటలు చెప్పినా, స్క్రీన్ స్పేస్ దగ్గర, మిగిలిన వ్యవహారాల దగ్గర తేడా వస్తుంది. విక్టరీ వెంకటేష్ చాలా కాలంగా మల్టీ స్టారర్ లకే మొగ్గు చూపుతున్నారు. 

 

సీనియర్ హీరోగా మారిపోవడంతో యంగ్ హీరో తన పక్కన వుండాలని వెంకీ తెలివిగా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ తీరా ఎగ్జిక్యూషన్ లోకి వచ్చేసిరికి ఫోకస్ ఆయన మీదే వుండి సినిమా రిజల్ట్ తేడా కొట్టేస్తుంది. మసాలా సినిమా పరిస్థితి తెలిసిందే. సీతమ్మ వాకిట్లో...సినిమా కో స్టార్ మహేష్ బాబు కాబట్టి అంతగా సమస్య రాలేదు. నాగ చైతన్యతో వెంకీమామ చేసారు. మేనల్లుడు కాబట్టి పాత్రలు ఈక్వెల్ గా వుంటాయాని అనుకున్నారు అంతా. కానీ ఇక్కడా వెంకీకే ఎక్కువ ప్రాధాన్యత వుందని, చైతన్య పాత్రను అంతగా డిజైన్ చేయలేదని ఫ్యాన్స్ వాపోతున్నట్లు తెలుస్తోంది.  

 

మరి దాని ప్రభావమో, లేదా మరెందువల్లనో ఇప్పట్లో మల్టీ స్టారర్ చేయడానికి నాగ చైతన్య ఇష్టపడడం లేదని తాజా సమాచారం. బంగార్రాజు సినిమాలతో తండ్రితో కలిసి చేయాలి. కానీ ఆ సినిమాకు ముందే కనీసం రెండు సినిమాలైనా  సోలో హీరోగా చేయాలని చైతూ డిసైడ్ అయినట్లు లేటెస్ట్ అప్‌డేట్. పరుశురామ్ తో సినిమా కంప్లీటయిన తరువాత.. లేదా  మరో సినిమా కూడా సోలోగా చేయాలని అనుకుంటున్నాడట చైతూ. అప్పుడే మల్టీ స్టారర్ చేయాలని చైతన్య ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక బంగార్రాజు స్వంత సినిమా కాబట్టి, పరుశురామ్ సినిమా తరువాత చేసే అవకాశం వుంది. కానీ ఆ తరువాత మాత్రం మల్టీ స్టారర్ ల జోలికి చైతన్య వెళ్లడం కష్టమేనని టాక్ వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: