యష్ రాజ్ ఫిల్మ్స్ సైఫ్ అలీ ఖాన్రాణి ముఖర్జీలను బంటీ ఔర్ బబ్లీ రీమేక్ బంటీ ఔర్ బబ్లీ 2 కోసం ఖరారు చేసారు.   సైఫ్ మరియు రాణి జోడి  బ్లాక్ బస్టర్ జోడి, ఎందుకంటే వారు హమ్ తుమ్,  తారా  రమ్ పమ్ వంటి పెద్ద విజయాలను అందించారు.  వారిద్దరి   కెమిస్ట్రీ  ప్రేక్షకులను కనువింపు చేయడానికి ఈ చిత్రం ద్వారా ముందుకు రాబోతుంది. వీరిద్దరూ 11  సంవత్సరాల తర్వాత తిరిగి కలిసి నటించబోతున్నారు.

 

 

 

 

 

 

 

 

 

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ 10 సంవత్సరాల తర్వాత ముందుకు  రాబోతుంది. బంటీ ఔర్ బబ్లీ చిత్రం ప్రధానంగా బంటీ , బబ్లీ పాత్రల మధ్య తిరుగుతుంది. యష్ రాజ్ ఫిల్మ్స్  ఇంతకుముందు సిద్ధంత్ చతుర్వేది (గల్లీ బాయ్ ఫేమ్) , కొత్త హీరోయిన్ షార్వారి జంటను  బంటీ మరియు బాబ్లిగా ప్రకటించింది. ఇప్పుడు, ఒరిజినల్స్ కూడా తిరిగి ఫ్రాంచైజీలో ఉన్నందున, ఇది చూడటానికి భారీ ట్విస్ట్.

 

 

 

 

 

 

 

సైఫ్ అలీ ఖాన్ యష్ రాజ్ ఫిల్మ్స్   ఫ్రాంచైజీ లో ఒక భాగం అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇలా అన్నారు.  బంటీ ఔర్ బుబ్లు  2 పూర్తిగా రీబూట్ చేయబడిన సీక్వెల్,  ఇది నేటి కాలంలో సెట్ చేయబడిన కథ. ఈ చిత్ర స్క్రిప్ట్  నాకు బాగా నచ్చింది.ఈ స్క్రిప్ట్  అద్భుతమైన స్క్రిప్ట్. మొత్తం కుటుంబ సభ్యులు ఒక దగ్గర  కూర్చుని ఆనందించడానికి ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఇది నాకు కొత్త పాత్ర. ఈ చిత్రంలో ఒరిజినల్స్ మరియు కొత్త బంటీ బాబ్లి మధ్య సన్నివేశాలు కూడా నాకు చాలా ఇష్టం.  రాణి మరియు నేను ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు చాలా సరదాగా  కలిసి  పని చేస్తాము.  ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న బంటీ ఔర్ బబ్లీ 2  తన మొదటి షూటింగ్ షెడ్యూల్ ను  ప్రారంభించింది.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: