మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా ప్రతిరోజు పండుగే. గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ కలిసి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా తాత.. మనవడు మధ్య సెంటిమెంట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇవన్ని సినిమా మీద అంచనాలు పెంచాయి.

 

అయితే ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా కథ ఈమధ్యనే వచ్చిన రెండు తెలుగు సినిమాలకు పోలిక ఉందని అంటున్నారు. అందులో ఒకటి శతమానం భవతి కాగా.. మరోటి రాజేంద్ర ప్రసాద్ తోలుబొమ్మలాట. శతమానం భవతి సినిమాలో తల్లిదండ్రులు విడిపోతున్నారని తెలుసుకుని ప్రకాశ్ రాజ్, జయసుధ పిల్లలు ఊరు వస్తారు. ఇక తోలు బొమ్మలాటలో కూడా ప్రేమించిన మనవడు, మనవరాళ్లను కలపడానికి తాతయ్య నాటకం ఆడతాడు.

 

ఈ రెండు కథల్లో కామన్ పాయింట్ తాత పాత్ర. ప్రతిరోజు పండుగే సినిమాలో కూడా హీరోకి తాతయ్య అంటే చాలా ఇష్టం. అయితే అతను మరికొద్దిరోజుల్లో చనిపోతాడని తెలిసిన మనవడు అతను లైఫ్ లో మిస్సైనవన్ని చేయిస్తాడు. తాత, మనవడి మధ్య ఎమోషనల్ సీన్స్ అలరిస్తాయని తెలుస్తుంది. సినిమా ట్రైలర్ చూసి ప్రేక్షకులకు ఇదేదో శతమానం భవతి సినిమాలా ఉంటుందని అనుకుంటారని మారుతి తన సినిమాపై తానే సెటైరికల్ డైలాగ్ రాసుకున్నాడు.

 

అయితే నిజంగానే ఈ సినిమా ఆ కథలతోనే వచ్చిందా అన్నది తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేస్తే సపోతుంది. ఈ సినిమాలో సాయి ధరం తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. సినిమాకు థమన్ మ్యూజిక్ అందించగా సినిమాలోని సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రలహరితో హిట్ ట్రాక్ ఎక్కినా సుప్రీం హీరో సాయి ధరం తేజ్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: