మరో మూడు వారాల్లో సంక్రాంతి తెలుగు సినిమా పుంజులు వెండితెరపై దండెత్తనున్నాయి. అల్లు అర్జున్, మహేశ్ బాబు తమ సినిమాలతో పోటీ పడుతూ హీట్ పెంచుతున్నారు. వీరిలో ఎవరు పైచేయి సాధిస్తారోనని ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తెలుగు సినిమాకు ఆయువుపట్టుగా మారిని యూఎస్ కలెక్షన్లలో టాప్ ప్లేస్ లో ఉండే మహేశ్ బాబను అల్లు అర్జున్ ఇప్పటికే పైచేయి సాధించడం పోటీలోని హీట్ ను మరింత పెంచుతోందని చెప్పాలి.

 

దూకుడు సినిమా నుంచి మహేశ్ బాబుకు యూఎస్ లో మంచి క్రేజ్ ఏర్పడి డీసెంట్ కలెక్షన్లు రాబడుతున్నాయి. కానీ.. మహేశ్ రీసెంట్ మూవీ మహర్షి తెలుగు నేలపై పర్వాలేదనిపించగా యూఎస్ లో బోల్తా కొట్టింది. దీంతో ఇప్పుడు సరిలేరు నీకెవ్వరుకు కొద్దిగా బజ్ తగ్గింది. ఇక బన్నీకి కూడా యూఎస్ లో మంచి రెవెన్యూ వస్తుంది. దర్శకుడు త్రివిక్రమ్ మూవీస్ కు కూడా యూఎస్ లో మంచి మార్కెట్ ఉంది. దీంతో అల.. వైకుంఠపురంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా ప్రీమియర్లకు పోటీ ఏర్పడనుందని సమాచారం. బాహుబలి తర్వాత రికార్డు స్థాయిలో ఈ ప్రీమియర్లు ఉండబోతున్నాయని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు ఏ రేంజ్ లో హిట్టయ్యాయో కూడా తెలిసిన విషయమే. ఇదే నిజమైతే మహేశ్ పై బన్నీ ఇప్పటికే పైచేయి సాధించినట్టే.

 

సంక్రాంతి రేసులో నాలుగు సినిమాలు పోటీ పడుతూండగా ముఖ్యంగా రెండు సినిమాలు కాలు దువ్వుతున్నాయి. ప్రతి సంక్రాంతికి దాదాపు ఆరు నెలల ముందే తమ సినిమాలను రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసుకుంటారు. వచ్చే సంక్రాంతికి కూడా ఇలాంటి పోటీనే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. సంక్రాంతి పండుగ, సెలవులను రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వస్తున్న ఈ సినిమాల పరిస్థితేంటో చూడాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: