వరుసగా రెండు ఫ్లాపులు తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన 'రూలర్' సినిమా నటించడం జరిగింది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్ చాలావరకు సినిమా పూర్తయ్యే వరకు ఎక్కడా కూడా బయటికి రాలేదు. అయితే సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో రెండు నెలలకు ముందు సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయడంతో ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. అయితే సినిమాకి సంబంధించిన బాలయ్య లుక్ మరియు టీజర్ విడుదలయ్యాక సినిమాపై అభిమానులు పెద్దగా అంచనాలు పెట్టుకోలేదని సినిమా కూడా పోయే అవకాశాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది.

 

అంతే కాకుండా సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అంతంతమాత్రంగా సాగిందని...ఓవర్సీస్లో అయితే సినిమాకి అసలు రేటు పలకలేదని దీంతో నిర్మాత సి.కళ్యాణ్ సినిమా రిలీజ్ చేద్దామా వద్దా అన్న డైలమాలో పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే తెల్లారితే సినిమా రిలీజ్ అవుతుండగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ రికార్డు స్థాయిలో అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.

 

ఈ నేపథ్యంలో గతంలో ‘రూలర్’ సినిమా పై వచ్చిన వార్తలన్నీ పుకార్లే అనీ స్పష్టం అయ్యాయి.  అసలు ఈ స్థాయిలో బుకింగ్స్ అవుతాయని ఎవరూ ఉహించలేనంతగా ప్రస్తుతం సినిమాకి మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. మొత్తంమీద చూసుకుంటే బాలయ్య సినిమా 'రూలర్' కి మంచి ఓపెనింగ్స్ వస్తున్నట్లు స్పష్టం అవుతున్నాయి. సినిమాలో బాలయ్య చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించారట. గతంలో బాలకృష్ణ చేసిన సినిమాలు ఎన్నడూ లేనివిధంగా ఫైట్లు ఈ సినిమాలో ఉండేటట్లు డైరెక్టర్ కె.ఎస్ రవికుమార్ శ్రద్ధ తీసుకున్నారట. మొత్తం మీద ఎటువంటి అంచనాలు లేని బాలయ్య 'రూలర్' కి భారీ ఓపెనింగ్స్ ప్రస్తుతం దక్కుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: