కేయస్ రవికుమార్ తెరకెక్కించిన  చిత్రం రూల‌ర్‌. నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించారు. సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు.. యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ రోజు ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు (డిసెంబ‌ర్ 20)న వ‌చ్చింది. ఇక ఈ చిత్రంలో ఫైట్ల విష‌యానికి వ‌స్తే... బాలయ్య సినిమాలో ఫైట్లు అంటే మాస్ ను మెప్పించేలా ఓ రేంజ్ లో ఉండాలి అన్నది వాస్తవం అయితే అవి మరీ ఓవర్ అయిపోతున్నాయి అన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి గతంలో బాలయ్య ఒంటిచేత్తో ట్రైను ఆపినప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు అయిన బాలయ్య తీరు మాత్రం మారలేద‌ని కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు.  జైసింహ సినిమా లో సింగిల్ హ్యాండ్ తో పైకెత్తాడు. ఇక ఈ సినిమాలో విలన్ కొడుతుంటే గాల్లోకి ఎగరడం కామన్ అయిపోయింది పరమ రొటీన్‌గా  ఫైట్ లు ఉన్నాయి. రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, అన్బార్వ్ కంపోజ్ చేసిన ఫైట్ లో కొత్తదనం మిస్ అయ్యింది. రొటీన్ రొడ్డ‌కొట్టులాగే అనిపించింది. ఆయ‌న చేసే ఫైట్ల‌న్నీ కూడా సర్క‌స్ ఫీట్ల‌ను త‌ల‌పించాయి. 

 

"ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే - దీన్ని పండించిన రైతుకు ఇంకెంత పవరు - పొగరు ఉంటుందో చూపించమంటావా?" అన్న బాలయ్య రొటీన్ మాస్ డైలాగ్  టోటల్ గా  సినిమా 'రూలర్'  అదుర్స్‌,  దుమ్ములేపుద్దనుకున్నారు. సి.కల్యాణ్, కేఎస్ రవికుమార్, బాలయ్య కాంబినేషన్‌లో ఇప్పటికే ‘జైసింహా’ వచ్చింది. ఈ సినిమా హిట్ అయింది. దీంతో ఈ ‘రూలర్’ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్ న‌టించారు. అప్పుడే  బాలయ్య ఫ్యాన్స్ కొంత మంది ఈ సినిమా పై టిక్ టాక్ లో డైలాగుల‌తో వాటిని విరివిగా వాడడం ప్రారంభించారు. 'ఇది దెబ్బతిన్న సింహాంరా.. అంత తొందరగా చావదు. వెంటాడి వేటాడి చంపుద్ది' అన్న డైలాగ్ హిట్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: