‘ప్రతిరోజూ పండగే’ అంటూ పండగ ముందే సందడి చేసేందుకు డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుప్రీం హీరో సాయి ధరం తేజ్ & రాశీ ఖన్నా హీరో, హీరోయిన్స్ గా తమిళ్ సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రావు రమేష్, నరేష్ లాంటి ఎందరో సీనియర్ నటులు కనిపిస్తున్నారు. వరస ఫ్లాఫ్ లతో దూసుకుపోయిన సాయి తేజ ... చిత్రలహరి మూవీతో ఓ డీసెంట్ హిట్ తన ఖాతాలో వేసుకుని కాస్త ఒడ్డున ప‌డ్డాడు .

 

మ‌రోవైపు  గ్రామీణ నేపథ్యం, కుటుంబ బంధాలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఈ చిత్రంలో మారుతీ ఏదో కొత్తగా చూపించారనే భావన ప్రేక్షకుల్లో కలిగించగలిగారు. మొత్తానికి భారీ అంచనాల నడుమ `ప్ర‌తిరోజు పండ‌గే` సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్కేఎన్ సహ నిర్మాత. కాన్సర్‌తో కేవలం ఐదు వారాలు మాత్రమే బతికే అవకాశం ఉన్న తాత కోరిక మేర‌కు..  కుటుంబాన్ని ఒకే చోట‌కు చేర్చేందుకు మనవడు పడే తాపత్రయమే ఈ చిత్ర కథ.

 

ఇందులో తాతగా సత్యరాజ్.. మనవడిగా సాయి తేజ్ నటించారు. ఇక ప్రీమియ‌ర్ షో టాక్ విష‌యానికి వ‌స్తే.. ప‌స్టాఫ్‌లో కామెడి ప‌ర్వాలేద‌నిపించుకున్నా.. సెకండాఫ్‌లో మాత్రం ఎమోష‌న‌ల్ ట్రాక్ ఓవ‌ర్‌గా ఉన్న‌ట్టు అనిపిస్తుంది. సినిమా చూసే ప్రేక్ష‌కుల‌కు సీన్లను బ‌ల‌వంతంగా ఇరికించ‌న భావ‌న క‌లుగుతుంది. అలాగే సెకండాఫ్‌లో క‌నెక్ట్ కాని ఎమోష‌న‌ల్ సీన్లు మారుతి ఎక్కువ పెట్టిన‌ట్టు ఉంటుంది. ఇక సినిమా ప‌రంగా కామెడీ వ‌ర్కోట్ అయినా.. క‌థ‌కు సంబంధం లేని కామెడీ ఎక్కువ ఉంటుంది. ఓవ‌రాల్‌గా సినిమా బిలో య‌వ‌రేజ్ అనిపించుకున్నా.. క‌మ‌ర్షియ‌ల్‌గా ఎలా స‌క్సెస్ అవుతుందో? చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: