నందమూరి బాలకృష్ణ కె.ఎస్ రవికుమార్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా రూలర్. సి.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా నటించారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. టీజర్, ట్రైలర్ చూసే సినిమా రొటీన్ రెగ్యులర్ మాస్ ఎంటర్టైనర్ అనుకోగా సినిమా నుండి వచ్చిన ఫస్ట్ టాక్ కూడా అలానే వచ్చింది.

 

ఆల్రెడీ తెలుగులో వచ్చిన ఔట్ డేటెడ్ కథ, కథనాలతో బాలయ్య రూలర్ సినిమా వచ్చింది. కొత్త సీసాలో పాత పచ్చడి పెట్టినంత మాత్రానా దానికి కొత్త రుచి వస్తుందా చెప్పండి. అలానే ఆల్రెడీ ఇలాంటి కథలతో వందల కొద్దీ సినిమాలు రాగా మళ్లీ అలాంటి కథతోనే వస్తే ఎలా ఉంటుంది. మొదటి నుండి రూలర్ సినిమా మీద ఒకరమైన నెగటివ్ థాట్ ఏర్పడింది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక అది నిజమైంది.

 

సినిమాలో బాలయ్య బాబు రెండు వేరియేషన్స్ లో కనిపించడం.. తన స్టైల్, లుక్ పరంగా ఆకట్టుకున్నా రొటీన్ రొట్ట కథలను ఎంత కలర్ అద్దిగా ఆడియెన్స్ కు రుచించదు. సినిమాలో బాలయ్య ఎనర్జీ మరోసారి వారెవా అనిపించేలా ఉన్నా ఆ ఎనర్జీ మొత్తం ఒక ఔట్ డేటెడ్ స్టోరీ కోసం వేస్ట్ చేశాడని ఆడియెన్స్ అంటున్నారు.

 

ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన ఎన్.టి.ఆర్ బయోపిక్ కూడా నిరాశపరచగా బాలయ్య రూలర్ గా నందమూరి ఫ్యాన్స్ ను అలరించాలని అనుకున్నాడు. అయితే రూలర్ తో అది సాధ్యమవ్వలేదని తెలుస్తుంది. రూలర్ ఫస్ట్ టాక్ నందమూరి ఫ్యాన్స్ ను టెన్షన్ లో పడేస్తుంది. ప్రీమియర్స్ షో టాక్ ప్రకారం రూలర్ కు ఘోరమైన టాక్ రాగా తెలుగు రాష్ట్రాల్లో రెగ్యులర్ షోస్ తో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: