చిత్రలహరీ సినిమా విజయం తర్వాత సై హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం ప్రతి రోజూ పండగే.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల ద్వారా రిలీజ్ అయింది ..ఇటీవల విడుదలైన చిత్రంలోని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఇవాళ రిలీజ్ అయిన ఈచిత్రం ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది తప్ప సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేదు అని ప్రేక్షకులు అభిప్రాపడుతున్నారు..

 


 కామెడీ బాగా పండింది..కానీ మెగా హీరో గ్రేడ్ మాత్రం కనిపించలేదని టాక్  వినపడుతుంది..అసలు విషయానికొస్తే... సినిమా కథ ఎదో పుస్తకాల కథను అల్లినట్లు ఉందనే వార్తలు వినపడుతున్నాయి..ఇంకా కథలోకి వెళ్లినట్టయితే సత్యరాజ్ లంగ్ (ఊపిరితిత్తుల)క్యాన్సర్ తో బాధపడతారు అయితే తన ఆఖరి రోజుల్లో గడిపే కొన్ని క్షణాలు అయినా సంతోషంగా ఉంచాలని యూఎస్ నుంచి సాయి తేజ్(సాయి ధరమ్ తేజ్) ఇండియాలోకి రాజమండ్రిలోని తన ఊరికి బలదేరుతాడు.అక్కడ నుంచే తన కుటుంబాన్ని ఒకే చోటుకు చేర్చాలని ప్లాన్ చేస్తాడు.


అలా తాతగారు కోలుకోవాలని కుటుంబాలను దగ్గర చేస్తారు.. వీటివల్ల సినిమాకు చైన్ లింక్ లాగా ఉంది కానీ కథ మాత్రం ముందొచ్చిన సినిమాల మాదిరిగా ఉందని జనాలు అంటున్నారు.. ఉమ్మడి కుుంబంలోని సన్నివేశాలు ప్రతి రోజు పండగే అనే నేపథ్యంలో వచ్చి న ఈ సినిమా కుల్లు జోకులు ఎక్కువగా ఉన్నయనే మాటలను మూత కట్టుకుంది.. సినిమా ఎలా ఉందనే విషయాన్ని చెప్పాలంటే కామెడీ అల్లుకుంది కథ అల్లుకొలేదు అని అర్థమవతుంది..

 

మరో విషయమేంటంటే.. సినిమాలో సాయి తేజ్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు?నిజంగానే సత్యరాజ్ కు ఏమన్నా అయ్యిందా లేక ప్లానా?ఈ పరిస్థితులను సాయి తేజ్ ఎలా హ్యాండిల్ చేసాడు?ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే. అందుతున్న సమాచారం ప్రకారం మారుతి జిమ్మిక్కులు చేసినా కూడా సినిమా ఆకట్టుకోలేక పోయింది.. ఫైన‌ల్‌గా మారుతి అంచ‌నాలు అందుకోలేదంటున్నారు.. బిలో యావ‌రేజ్ అంటున్నారు.. మరి వసూళ్ల విషయానికొస్తే సినిమాకు వచ్చేలా ఉన్నాయంటూ సినీ ప్రముఖులు అంటున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: