నందమూరి బాలకృష్ణ గూర్చి వేరే చెప్పాలిసిన పనిలేదు... డైలాగ్ చెప్పారంటే థియేటర్ లో విజిల్స్ మారు మోగాల్సిందే... తనదైన స్టైల్ లో ఈ వయసులో కూడా డిఫరెంట్ కథలతో, డిఫరెంట్ స్టైల్స్ తో, సినిమా సినిమాకి వేరియేషన్స్ మారుస్తూ ఉంటారు...

 

తాజాగా శుక్రవారం రిలీజ్ అయిన రూలర్ సినిమాలో బాలకృష్ణ లుక్స్, స్టైల్ సూపర్ గా ఉన్నాయి.. ఈ తరం యంగ్ హీరోలకి దీటుగా ఉన్నారు... రూలర్ సినిమాకంటే ముందుగా బాలకృష్ణ, కేయస్‌ రవికుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రం జైసింహాకు యావరేజ్‌ టాక్‌ రావటంతో ఈ సినిమాపై పాజిటివ్‌ టాక్ క్రియేట్‌ అయ్యింది.

 

అందుకు తగ్గట్టుగా బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా నటించారు. నందమూరి బాలకృష్ణ, సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన మాస్‌ మసాలా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రూలర్‌. కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు చిరంతన్‌ భట్‌ సంగీతమందించాడు.అంతేకాకుకండా భూమిక, ప్రకాష్ రాజ్ ముఖ్యం పాత్రలలో నటించారు. సీ కళ్యాణ్‌ నిర్మించాడు.... బాలయ్య గత చిత్రాలు ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ఆశించినంత రిజల్ట్స్ రాలేదు..

 

అందుకే అభిమానులు ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు.ఈ శుక్రవారం సినిమా రిలీజ్ అయింది... సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో బాలయ్య మెప్పించారని టాక్.. అంతేకాకుండా స్టైలిష్ బిజినెస్ మాన్ పాత్రలో కూడా వెరియేషన్ చూపించారు... రెండు పాత్రలలో నటించాలంటే ఎవరికన్నా కష్టమే. కాని బాలయ్య బాబు కి మాత్రం ఇది సాధ్యమే.. అంతకముందు సినిమాల్లో కూడా రెండు పాత్రల్లో నటించిన అనుభవం ఉంది..

 


అమెరికా లో ఇప్పటికే రూలర్‌ ప్రీమియర్స్‌ షోస్‌ పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల మిడ్‌నైట్‌ నుంచే సందడి మొదలైంది.బాలయ్య సినిమా అంటే మాములే మరి.... సినిమా చూసిన వాళ్లు వాళ్ల అభిప్రాయాలను సోషల్‌ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకు సినిమాకు డివైడ్‌ టాక్‌ వస్తోంది. అభిమానులు బాలయ్య ఎనర్జీ సూపర్‌ అంటుంటే ఇతర ప్రేక్షకులు నెగెటివ్‌ రిపోర్ట్ ఇస్తున్నారు.

 

సినిమాలో బాలయ్య ఎలివేషన్‌ సీన్స్‌, యాక్షన్‌ సీన్స్‌ సూపర్‌ అంటున్నారు ఫ్యాన్స్‌. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే `పడతాడు` పాటలో బాలయ్య ఎనర్జీ సూపర్‌ అంటున్నారు. ఈ సాంగ్‌కు థియేటర్లు విజిల్స్‌ పడుతున్నాయట... ఈ పాటలో బాలకృష్ణ నటన, ఎనర్జీ తో థియేటర్ ని ఒక ఊపు ఊపేశారట.. ఫస్ట్ హాఫ్ సినిమా ఎంటర్టైన్మెంట్ తో ముందుకు పోయింది.. కాని సెకండ్ హాఫ్ సినిమా కొంచెం నిరాశ పరిచిందని, దర్శకుడు స్టోరీ ని తేల్చసాడని అంటున్నారు... కాని బాలయ్య యాక్షన్ మాత్రం బాగుంది అంటున్నారు విమర్శకులు...

 

బాలకృష్ణ సినిమా అంటేనే వన్ మాన్ షో.. అంతా ఆయనే..అందుకే వేరే పాత్రలు గూర్చిన టాక్ వినపడలేదు ఎనర్జీ విషయంలో, డైలాగ్ డెలివరీ విషయంలో, యాక్షన్ సన్నివేశాలలో అదరగొట్టారట... కాని సినిమా విషయంలో సాధారణ ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నట్లు ట్విట్టర్ టాక్... కాని బాలకృష్ణ అభిమానులకు మాత్రం అయన యాక్టింగ్ నచ్చుతుందట..


మరింత సమాచారం తెలుసుకోండి: