బాలయ్య బాబు రూలర్ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.  సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నా... సినిమా మాత్రం పెద్దగా లేదని తెలుస్తోంది. అద్భుతంగా ఉండబోతుందని ఎంతోగానో ఊహించుకొని థియేటర్స్ వెళ్లిన ప్రేక్షకులకు ఆ ఊహకు తగ్గట్టుగా సినిమా లేదని అంటున్నారు.  105 వ సినిమా కోసం సీనియర్ దర్శకుడిని తీసుకోవడంతో పాటు పరుచూరి మురళి ఇచ్చిన కథను తీసుకొని బాలయ్య సినిమా చేశారు.  


అయితే, సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినట్టు సమాచారం అందుతోంది.  ఇప్పటికే ఫస్ట్ హాఫ్ సినిమా పూర్తయింది.  ఇంటర్వ్యూ బ్యాంగ్ తప్పించి సినిమాలో పెద్దగా విషయం లేదని అంటున్నారు.  ఇక సీన్స్ పరంగా చూసుకుంటే సినిమా సాగతీసినట్టుగా లెంగ్త్ ఎక్కువతో ఉన్నాయని టాక్ వస్తోంది.  మరీ సీన్స్ ఈ స్థాయిలో సాగదీయడం ఏంటి అని అంటున్నారు.  


బహుశా ఈ కారణంగానే నిడివిని రెండున్నర గంటలకు గట్టించేసి ఉండాలి.  లేదంటే సినిమా ఇంకా దారుణంగా ఉండేది.  పాపం ఎన్టీఆర్ బయోపిక్ తో డీలా పడ్డ బాలయ్య ఈ సినిమాతో నిలబడాలని ట్రై చేశారు.  కానీ, అది సాధ్యం కాలేదని అర్ధం అయ్యింది.  సినిమా కోసం చేసిన ప్రయత్నాలు అన్ని కూడా రివర్స్ అయ్యాయి.  ఈ రివర్స్ కారణంగా సినిమా బోల్తా కొట్టింది.  ఫస్ట్ హాఫ్ వరకు సినిమా పెద్దగా లేదని టాక్ వినిపిస్తోంది.  


ఇక సెకండ్ హాఫ్ ను బట్టి సినిమా ఎలా ఉంటుంది అన్నది తేలిపోతుంది.  పాత చింతకాయ పచ్చడిని మిక్సీలో వేసి తీసినట్టుగా సినిమా ఉందని అంటున్నారు.  సినిమాపై నమ్మకం పెట్టుకొని ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది.  ఈ అంచనాలను అందుకోవాలి అంటే ఈ సమయంలో బాలయ్యకు చాలా కష్టమే.  పాపం నిర్మాతలు ఈ కష్టాల నుంచి ఎలా బయటపడతారో చూడాలి.  సెకండ్ హ్లాఫ్ ఏదైనా మ్యాజిక్ చేస్తే సినిమా నిలబడుతుంది.  లేదంటే గోవిందా గోవిందా... 

మరింత సమాచారం తెలుసుకోండి: