తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి నట సింహం బాలకృష్ణకు ప్రత్యేక శైలి ఉంది. సినిమాలు చేయడంలో వేగం ఉంటుంది. ఓసారి కథ నచ్చితే ఇక వెనుదిరిగి చూసేది ఉండదు. కథ, కథనాల్లో, సంగీతం, దర్శకత్వం విభాగంలో వేలు పెట్టేది ఉండదు. ఎప్పటినుంచో బాలయ్య ఇదే ఫాలో అవుతూంటాడు. అందుకే ఆయన కెరీర్ హిట్ ఫ్లాపులకు అతీతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం బాలయ్య నటించిన కొత్త సినిమా రూలర్ తెలుగు రాష్ట్రాల్లో సందడి చేస్తోంది. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకు ధియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది.

 

 

నిజానికి బాలయ్య సినిమాకు ఓ మాదిరి టాక్ వచ్చినా కలెక్షన్లు కుమ్మేస్తూంటాయి. సినీ పండితుల అభిప్రాయం కూడా ఇలానే ఉంటుంది. ఒక్కో సినిమా దెబ్బతింటే కనిపించని ప్రేక్షకులు.. బాగానే ఉంది అనే టాక్ వస్తే మాత్రం ధియేటర్ల వద్ద ప్రేక్షకుల క్యూ మాత్రం ఖాయం. ఇది ఎన్నోసార్లు నిరూపితం అయింది కూడా. సింహ ముందు వరకూ వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ఈ సినిమా బాగుందనే టాక్ రావడంతో కలెక్షన్లు అదరగొట్టేశాయి. ప్రస్తుతం రిలీజ్ అయిన రూలర్ పై కూడా అభిమానులు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. యావరేజ్ అనే టాక్ వచ్చినా బాలయ్య రేంజ్ లో కలెక్షన్లు రావడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ధియేటర్లలో సందడి చేస్తోంది.

 

 

నిజానికి బాలయ్యకు ఉన్న అభిమానులే బలం. వారు చెప్పిందే టాక్. మాస్ అంశాలను సినిమాలో దిట్టంగా చొప్పించడం ఆయనకు తెలిసిన విద్య. రూలర్ కూడా అలానే ఉండి అభిమానులను ఆకట్టుకుంటుందని అంటున్నారు. బాలయ్యకు స్వతహాగా ఉండే అభిమానులకు తోడు ఆయన సొంత పార్టీ టీడీపీ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉండటం కలిసొచ్చే అంశం. మరి ఈ సినిమాతో బాలయ్య ఏవిధంగా రూల్ చేసి రూలర్ అనిపించుకుంటాడో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: