మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూపులు చూస్తున్న రూలర్ సినిమా మొత్తానికి నేడు ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. నిన్న రాత్రి యుఎస్ఏ, యూఏఈ వంటి దేశాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి. వాటి నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలోని కథ, కథనాల్లో ప్రత్యేకంగా ఏమి కొత్తదనం లేదని, ఓవర్ ఆల్ గా ఈ సినిమా ఒక యావరేజ్ సినిమాగా నిలిచే ఆకాశం కనపడుతోదని అంటున్నారు ప్రేక్షకులు. అయితే బాలయ్య మాత్రం మరొక్కసారి తన అద్భుత నటనతో ప్రేక్షకులను మరియు ఫ్యాన్స్ ను అలరించారని చెప్తున్నారు. 

 

ఇక ఫైట్స్ మరియు డాన్స్ వంటి వాటిలో మరొక్కసారి తన సత్తా చాటిన బాలయ్య, ముఖ్యంగా పాటల్లో స్టెప్స్ బాగా వేసారని అంటున్నారు. సినిమాలోని యర్రా య‌ర్రాని సాంగ్‌లో మాత్రం బాల‌య్య స్టెప్పులు ఒక ఊపు ఊపేశాయని, గత ఏడాది రిలీజ్ అయిన బాల‌య్య జై సింహా సినిమాలో అమ్మ కుట్టి సాంగ్‌లో వేసిన స్టెప్పుల‌ను మించి ఈ సాంగ్ లో డాన్స్ చేశారట. ఈ సాంగ్ లో బాలయ్య తన ఎన‌ర్జీతో థియేటర్స్ ని ఊపేశాడట. ఇక హీరోయిన్ సోనాల్ చౌహాన్ బిక‌నీ అందాలు అదుర్స్‌ అని, అలానే ఈ సాంగ్ కు ఆయ‌న అభిమానులు థియేట‌ర్ల‌లో విజిల్స్‌ తో అదరగొడుతున్నారని చెప్తున్నారు. 

 

ఇక కొంతమంది ప్రేక్షకుల నుండి నెగటివ్ రెస్పాన్స్ కూడా వస్తుండడం, అలానే పాత మూస పద్దతిలోనే సినిమా సాగడంతో, రాబోయే రోజుల్లో ప్రస్తుతం మిగతా సినిమాల పోటీని తట్టుకుని ఈ రూలర్ ఎంతవరకు నిలబడుతుంది అనేది మాత్రం కొంత అనుమానమే అంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లు వేదిక, సోనాల్ చౌహన్, ప్రకాష్ రాజ్, జయసుధ సహా సినిమాలోని మిగతా క్యారెక్టర్స్ అన్ని బాగున్నాయని, అయితే కథలో కొత్తదనం లేకపోవడమే సినిమా తేలిపోయిందని చెప్తున్నారు. మరి మున్ముందు ఈ సినిమా ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: