నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలతో విడుదలైన సినిమా రూలర్. గతంలో ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన కథానాయకుడు మహానాయకుడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటం.. ఈ రెండు సినిమాలలో బాలయ్య తనదైన మార్క్ యాక్షన్ కల్పించకపోవడంతో... బాలయ్య అభిమానులు అందరూ ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా ఇప్పటి వరకు ఎప్పుడు కనిపించనంత  కొత్త గెటప్ లో బాలయ్య ఈ సినిమాలో కనిపించడం.. కాస్త స్లిమ్ గా కూడా అవడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. అయితే నేడు  ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ప్రేక్షకులను  మాత్రం అంతగా ఆకట్టుకోలేక పోతుంది ఈ సినిమా. 

 

 

 

 కారణం... రొటీన్ కథ రొటీన్ యాక్షన్ రొటీన్ డైలాగ్ లు... ఇవన్నీ కలిసి సినిమా చూస్తున్న ప్రేక్షకులందరికీ బోర్ కొట్టించింది రూలర్  సినిమా. దర్శకుడు కె.ఎస్ రవికుమార్ కథలో కొంతైనా  కొత్తదనం చూపించలేకపోయారు. ఇంతకుముందు బాలయ్య ఆక్షన్ సినిమాలు ఎలా ఉన్నాయో అదే కథతో కె.ఎస్.రవికుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా చూస్తుంటే బాలయ్య పాత సినిమాలు  చూసినట్లు గానే ఉందని  ప్రేక్షకుడి భావన. ఇక రూలర్ సినిమా లో ఫస్ట్ ఆఫ్  కూస్తో బాగున్నప్పటికీ సెకండాఫ్ మొత్తం తేలిపోయింది. ఫస్టాఫ్ లో బాలయ్య ఎనర్జిటిక్ నటనతో సినిమాను గట్టెక్కించే గా.. హీరోయిన్లు సోనాల్ చౌహాన్ వేదిక అందాలు కూడా ఫస్టాప్లో ప్లస్ పాయింట్ గా మారాయి. ఇక ఫస్టాఫ్ లో బాలయ్య డాన్సులు కూడా ఒకింత ప్లస్ గానే  మారాయని చెప్పాలి. 

 

 

 కానీ సెకండాఫ్ లో మాత్రం సినిమా చూస్తున్న ప్రేక్షకులందరికీ బోరింగ్. సెకండాఫ్ ఈ విషయంలో దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది అని సినిమా చూసిన ప్రేక్షకులు భావిస్తారు. బాలయ్య రూలర్ సినిమా మొత్తం ఎప్పటిలాగే బాలయ్య సినిమాలంటే నాలుగు పాటలు నాలుగు ఫైట్లు నాలుగు  పంచ్ డైలాగులు సినిమా మొత్తం ఇలా గడిచిపోతూ ఉంటుంది. అయితే ప్రేక్షకులు సినిమాలను ఆదరించే పంథా  కూడా మారడంతో... ప్రస్తుతం ప్రేక్షకులందరికీ రూలర్  బోరింగ్ గానే ఉంటుంది. అదే కథ  అదే కథనం అదే పాటలు అదే ఫైట్లు.. బాలయ్య ఇంతకుముందు సినిమాల్లో ఎలా ఉన్నడో రూలర్  సినిమాలు కూడా అలాగే ఉంది కాస్తయినా కొత్తదనం ఎక్కడా కనిపించదు. కానీ ఒక్క విషయంలో మాత్రం బాలయ్య అందరిని ఆకట్టుకున్నాడు. ఐదు పదుల వయస్సులోనూ ఓన్లీ తన ఎనర్జీతో నే సినిమాను ముందుకు తీసుకెళ్ళాడు నందమూరి బాలకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: