ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఫోర్బ్స్ వివిధ రంగాల్లో ఎక్కవ పేరు ప్రఖ్యాతలతో  పాటు వారి ఆదాయ వివరాలకు సంబంధించిన జాబితాను విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా అత్యధిక సంపాదన, గడించిన పేరు ప్రఖ్యాతులు ఆధారంగా వందమంది ప్రముఖుల జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది.  గతేడాది అక్టోబరు 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు వారు ఆర్జించిన సంపాదన ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. ఇక ఈ జాబితాలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని సంపాదించాడు.  కోహ్లీ తర్వాతి స్థానంలో బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్‌ఖాన్‌లు ఉన్నారు. టాలీవుడ్ నటులు ప్రభాస్, మహేశ్‌బాబులు వరుసగా 44, 54వ స్థానాల్లో నిలిచారు.

 

ఈ జాబితాలో త్రివిక్రమ్ 77వ స్థానంలో నిలవడం విశేషం. విరాట్ కోహ్లీ రూ.252.72 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో ఉండగా, రూ.293.25 కోట్లతో అక్షయ్ కుమార్, రూ.229.25 కోట్లతో సల్మాన్ ఖాన్ రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అమితాబ్ బచ్చన్ (రూ.135.93 కోట్లు), షారూక్ ఖాన్ (రూ.124.38), రణ్‌వీర్ సింగ్ (118.2 కోట్లు), నటి ఆలియా భట్ (రూ.59.21 కోట్లు), సచిన్ టెండూల్కర్ (రూ.76.96 కోట్లు), దీపిక పదుకొనె (రూ.48 కోట్టు)లు టాప్-10లో చోటు ద‌క్కించుకున్నాడు.

 

అలాగే దక్షిణాదికి చెందిన నుంచీ.. సూపర్ స్టార్ రజనీకాంత్ వంద కోట్ల రూపాయల ఆదాయంతో 13వ స్థానంలో నిలవగా.. విజయ్ మాత్రం 47స్థానం దక్కించుకున్నాడు. మ‌రియు  రూ.35 కోట్లతో ప్రభాస్ 44వ స్థానంలో, 35 కోట్లతో మహేశ్ బాబు 54వ స్థానంలో ఉన్నారు.దర్శకుడు శంకర్ 31.5 కోట్లతో 55వ స్థానంలోను, కమల హాసన్ రూ.34 కోట్లతో 56వ స్థానంలో ఉన్నారు. ఇక రూ. 21.05 కోట్లతో  బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు 63వ స్థానంలో, అంతే మొత్తంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ 72వ స్థానంలో నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: