రూలర్ సినిమాతో నటసింహం మరోసారి జూలు విదిల్చింది. కంటి చూపుతో చంపేస్తానని అంటూనే గాల్లోకి సుమోలను లేపుతూ సినిమాలో విలన్లను బెదిరించే బాలయ్య బాబు.. ఆ బెదిరింపులు ప్రతిసినిమాలో కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఇలాంటి కధలను ప్రేక్షకుడు ఎంతవరకు ఆదరిస్తున్నాడనే విషయాన్ని బాలయ్యతో సినిమా చేస్తున్న దర్శకులకు గాని, నిర్మాతలకు గాని పట్టనట్లు లేదనిపిస్తుంది. ఎందుకంటే సినిమా చూడాలనే ప్రేక్షకుడు ధియోటర్‌కు వచ్చి హ్యాపీగా సినిమా చూస్తూ మధ్యలో అసహానికి గురైతే ఎలా ఉండుందో కొన్ని కొన్ని సినిమాలు నిరూపించాయి కూడా..

 

 

ప్రస్తుత పరిస్దితుల్లో ఎన్నో కొత్త కొత్త కధనాలతో, సరికొత్త హంగులతో సినిమాలు వస్తున్న నేపధ్యంలో ప్రతి వారికి టెక్నాలజీ అలవాటైన పరిస్దితుల్లో, సినిమా విలువలని అంచనా వేయడం పెద్ద కష్టం అనిపించదు.. ఇప్పుడు ప్రతి ప్రేక్షకుడి ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయి. సినిమా డైరెక్టర్స్ ఆలోచించే దానికంటే  సినిమా చూసే ప్రేక్షకుడు భిన్నంగా ఆలోచిస్తున్నాడు. అందుకే సినిమా చూసి బయటకు వచ్చాకా తన అభిప్రాయాన్ని నిస్సంకోచంగా వెల్లడిస్తున్నాడు..

 

 

ఇకపోతే కెస్‌..ర‌వికుమార్ మ‌రీ రోటీన్‌గా తీసేశాడని. చాలా సీన్లు గ‌తంలో చాలా సినిమాల్లో అందులోనూ బాల‌య్య సినిమాలో చూసిన‌ట్టుగానే ఉంటాయని అనుకుంటున్నారు. ర‌వికుమార్‌ గ‌తంలో తీసిన లింగా, జై సింహా, చాయ‌లు కూడా ఇందులో క‌నిపిస్తాయని సగటు ప్రేక్షకుడు అభిప్రాయపడుతున్నాడు.. ఇకపోతే ల‌య‌నే ఓ డిజాస్ట‌ర్ దీని కంటే అదే బాగుంది.

 

 

పూరి పైసా వాస‌ల్‌లో కూడా బాల‌య్య కొత్త‌గా ఉన్నాడు. డైలాగ డెలివ‌రీ అయినా బాగుంది.ఇందులో ఏం లేదని ఇప్పటికే బాలయ్య ఫాన్స్ఇ దేం కథ రా బాబు అని అసహనం వ్యక్తం చేస్తున్నారట.. ఇకపోతే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రూలర్’. హీరోగా బాలయ్యకు 105వ సినిమా. ‘జై సింహా’ తర్వాత  కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఈ రోజే విడుదలైంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: