కుటుంబ కథా చిత్రం అంటే అర్ధం మారిపోయి చాలా కాలమైంది. దర్శకుల ఆలోచనలు, కథ, మేకింగ్, మారుతున్న కాలం.. ఇవన్నీ సినిమాపై కూడా ప్రభావం చూపాయి. దీంతో దర్శకులు కొత్త కొత్త ఆలోచనలతో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. గతంలో కుటుంబ కధ అంటే ఓ కుటుంబానికి సంబంధం ఉండే కధలు వచ్చేవి. కానీ కొత్త ట్రెండ్ తో కుటుంబ కథ అంటే తెర నిండా జనమే కనిపించాలి.. ఓ ఇంట్లో అనేక కుటుంబాలు ఉండాలి. ఈ తరహా కొత్తదనానికి అలవాటు పడ్డ ప్రేక్షకులకు బోర్ కొట్టడం లేదు.

 

 

ఇదే తరహాలో అనేక కథలు మనకు వచ్చి సక్సెస్ అయ్యాయి. ఆకోవలో నేడు విడుదలైన సినిమా ప్రతిరోజూ పండుగ. సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ సినిమాను మారుతి తనదైన శైలిలో తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా ధియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సంక్రాంతి పండుగ ముందే వచ్చేసిందా అనుకుంటున్నారట. మారుతి స్టైల్ మేకింగ్, కామెడీ, పల్లెటూరు, పంట పొలాలతో సినిమా ఆద్యంతం సందడిగా ఉందనే టాక్ వస్తోంది. ఈ కుటుంబ కధను, సినిమాలో కుటుంబాలను చూస్తుంటే కృష్ణవంశీ సినిమాలుక కూడా గొర్తొస్తున్నాయట. నిన్నే పెళ్లాడతా నుంచి మురారి, చందమామ, గోవిందుడు అందరివాడేలే.. ఇలా ఏ సినిమా తీసుకున్నా కృష్ణవంశీ సినిమాలో జనం నిండుగా కనపడతారు. ఆ సందడినే ఇప్పుడు మారుతి కూడా ఫాలో అయ్యాడని అంటున్నారు.

 

 

ఫ్యామిలీ మూవీగా అలరిస్తుందని గీతా ఆర్ట్స్ బ్యానర్ కి ఇది మరో మంచి సినిమా అవుతుందనే టాక్ వస్తోంది. మొత్తానికి ఆరు వరుస ఫ్లాపుల తర్వాత చిత్రలహరితో ఊరట పొందిన సాయి ధరమ్ ఈ సినిమాతో గట్టెక్కాడనే అంటున్నారు. ఫ్లాపుల్లో ఉన్న మారుతికి కూడా ఈ సినిమా ఊరటనిచ్చిందనే అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: