బాలయ్య సినిమా అంటే మాస్ డైలాగులకు ఎలాంటి ఢోకా ఉండదు. ఇకపోతే అప్పుడప్పుడు వచ్చే మాంచి మసాల ఉన్న సాంగుల్లో అదరగొట్టే స్టెప్పులతో ఆడియన్స్ ను బెదరగొట్టడం బాలయ్యకు కొత్తేమికాదు. ఇకపోతే తాజాగా బాలకృష్ణ నటించిన చిత్రం రూలర్.. నందమూరి బాలకృష్ణ, సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరో హీరోయిన్లుగా, మాస్‌ మసాలా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని. కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో సీ కళ్యాణ్‌ నిర్మించగా. చిరంతన్‌ భట్‌ సంగీతమందించాడు..

 

 

ఇక ఈ సినిమాలో సరికొత్త లుక్ లో సిల్వర్ స్క్రీన్ పై బాలయ్య స్టైలిష్ అల్ట్రా లుక్ లో అదరగొట్టారని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో బాలయ్యపై వచ్చే ఈ మేకోవర్ సీన్స్ మరియు కొన్ని మార్క్ పంచ్ డైలాగ్స్ బాలయ్య నుంచి ఏమైతే కోరుకొని థియేటర్ కు జనం వాస్తారో వారికి ఫుల్ మీల్స్ లా  మారిందని చెప్పవచ్చూ. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకు బాలకృష్ణ సినిమాలంటే  గుర్తొచ్చేది మాస్ యాక్షన్, భారీ డైలాగులు, ఫైట్లు. అదిరిపోయే డ్యాన్స్‌లు. ఇదే ఫార్ములాతో బాలయ్య ఎన్నో ఏళ్లుగా నెట్టు కొస్తున్నాడు. ఇవన్నీ అభిమానులను అలరించే సినిమాలే.

 

 

కానీ రూలర్ సినిమా లో ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే అంశాలు లేవని తెలుస్తోంది. ఇక  బాలకృష్ణ కెరీర్ లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్.. సినిమాలు ఫ్యాన్స్ అలరిస్తూనే వినూత్నమైన కథ, కథనాలతో ఆ సినిమాలు ల్యాండ్ మార్క్ మూవీస్ గా నిలిచిపోయాయి. కానీ తర్వాత వచ్చిన సినిమాలు ఏవీ ఈ పద్ధతిని ఫాలో కావడం లేదని బాలయ్య సినిమాలు చూస్తే ఇదే అర్ధమవుతోంది. బాలయ్య ఇందుకే సూటవుతాడని దర్శకులే మన మీద రుద్దేస్తుంటే ఇంక బాలయ్య నుంచి కొత్త సినిమాలు ఎలా వస్తాయని అభిమానులు అనుకునే పరిస్థితి వస్తోందట..

 

 

ఇకపోతే జై సింహా సినిమాలో బాల‌య్య అమ్మ కుట్టి సాంగ్‌లో వేసిన స్టెప్పుల‌ను మించి ఈ సినిమాలో వచ్చే సాంగ్ లో డాన్స్ చేశారట. ప్రతి సాంగ్ లో బాలయ్య తన ఎన‌ర్జీతో థియేటర్స్ ని ఊపేశాడట. ఇక హీరోయిన్ సోనాల్ చౌహాన్ బిక‌నీ అందాలు అదుర్స్‌ అని, అలానే  ప్రతి సాంగ్ కు ఆయ‌న అభిమానులు థియేట‌ర్ల‌లో విజిల్స్‌ తో అదరగొడుతున్నారని చెప్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: