తమిళ  యువ హీరో శివ కార్తికేయన్, అభిమన్యుడు ఫేమ్  పీఎస్ మిత్రన్  కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం హీరో. మంచి  అంచనాల మధ్య  ఈరోజు విడుదలైన  ఈ చిత్రం  క్రిటిక్స్  నుండి పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంటుంది. సూపర్ హీరో  బ్యాక్ డ్రాప్ లో ఎడ్యుకేషనల్ సిస్టం ను  బేస్   చేసుకొని  తెరకెక్కిన ఈ చిత్రం  ఫ్యామిలీ ఆడియెన్స్ ను   ఆకట్టుకొనేలా ఉందట. జెంటిల్ మెన్ తరహా లో  వచ్చిన ఈ చిత్రంలో  కథ ,డైరెక్షన్ , శివ కార్తికేయన్ నటన,యువన్ శంకర్ రాజా  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ,విజువల్స్ పాజిటివ్ పాయింట్స్ కాగా   విలన్  పాత్ర బలంగా లేకపోవడం సినిమాకు మైనస్ అయ్యిందని టాక్.  ఓవరాల్ గా ఈచిత్రం బాక్సాఫీస్ విన్నర్  అవుతుందని  కోలీవుడ్  క్రిటిక్స్  అభిప్రాయపడుతున్నారు. 
 
కేజేఆర్ స్టూడియోస్ పతాకం పై కొట్టిపాడి జె రాజేష్  నిర్మించిన ఈ చిత్రంలో హలో ఫేమ్ కల్యాణిని ప్రియదర్శన్  హీరోయిన్ గా నటించగా  యాక్షన్ కింగ్ అర్జున్   కీలక పాత్రలో నటించాడు. కాగా  కళ్యాణి ప్రియదర్శన్ కు   తమిళ్ లో ఇదే మొదటి సినిమా కావడం విశేషం.  ఇక ఈ హీరో ను తెలుగులో యువ హీరో అక్కినేని అఖిల్   తో  రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.  ప్రస్తుతం అఖిల్ , బొమ్మరిల్లు  భాస్కర్ డైరెక్షన్ లో  తన నాల్గవ చిత్రంలో నటిస్తున్నాడు.  గత కొన్ని నెలలు శరవేగంగా  షూటింగ్   జరుపుకుంటున్న ఈ చిత్రం  జనవరిలో పూర్తి కానుంది. ఆ తరువాత అఖిల్ , పీఎస్ మిత్రన్ తో   ఓ సినిమా చేయనున్నాడట.  దాంతో  వీరి కాంబినేషన్ లో హీరో నే రీమేక్ చేయాలని  అనుకుంటున్నారని సమాచారం.   త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలుబడే అవకాశాలు వున్నాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: