నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ.  తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా వెండి తెరకు పరిచయం అయిన బాలకృష్ణ కెరీర్ బిగినింగ్ లో పల్లెటూరి బుల్లోడిగా నటించి మెప్పించారు. ఆ తర్వాత ఎక్కువగా ఫ్యాక్షన్ తరహా పాత్రల్లో నటిస్తూ వచ్చారు.  బాలయ్య పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ తో ఫ్యాక్షన్ తరహా సినిమాలకు మంచి ఆదరణ లభించింది.  ఫ్యాక్షన్ సినిమాలు అంటే బాలయ్యే కరెక్ట్ అనే స్థాయికి అప్పట్లో వరుస విజయాలు అందుకున్నాడు.  కానీ ప్రతిసారి అదే తరహా సినిమాలు రావడంతో ఆడియన్స్ కొంత బోరింగ్ ఫీల్ అయ్యారు.  దాంతో గౌతమి పుత్ర శాతకర్ణి, పైసా వసూల్ లాంటి సినిమాలతో అలరించారు.  తాజాగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు బాలయ్య.  

 

టాలీవుడ్ లో బాలకృష్ణ మూవీ అంటే నెల రోజుల ముందు నుంచే భారీ సందడి ఉంటుందన్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో వైజాగ్ లో ప్రీరిలీజ్ ఫంక్షన్ రోజు బాలయ్య ఇద్దరు హీరోయిన్లతో చేసిన సందడి అంతా ఇంత కాదు.  ఈ మూవీ తప్పకుండా సూపర్ సక్సెస్ అవుతుందని అన్నారు.  అయితే ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ఫైట్స్, ఎమోషన్స్, డైలాగ్స్ బీభత్సం అనుకున్నారు. సినిమాకు బాలయ్య టోనీ స్టార్క్ లుక్ తోనే విపరీతమైన క్రేజ్ సంతరించుకున్నారు.  అలా ఈ సరికొత్త లుక్ లో మాత్రం సిల్వర్ స్క్రీన్ పై బాలయ్య స్టైలిష్ అల్ట్రా లుక్ లో అదరగొట్టారని చెప్పాలి. కానీ మూవీ విషయానికి వస్తే..  ఫస్ట్ హాఫ్ లో బాలయ్యపై వచ్చే ఈ మేకోవర్ సీన్స్, కొన్ని మార్క్ పంచ్ డైలాగ్స్ బాలయ్య నుంచి ఏమైతే కోరుకొని థియేటర్ కు జనం వాస్తారో వారికి ఫుల్ మీల్స్ లా ఉంటాయన్న విషయం తెలిసిందే.

 

బాలయ్యను ప్రేక్షకులు ఎలా కోరుకున్నారో.. అలా చూపించడంలో రవికుమార్ మరోసారి అంచనాలు అందుకోలేకపోయారని టాక్ వినిపిస్తుంది. బాలయ్య సరికొత్త మేకోవర్,  కొన్ని యాక్షన్ సీన్స్ సహా ఇంటర్వెల్ బ్లాక్ లోని కొన్ని సీన్స్ డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మొత్తానికి బాల‌య్య త‌న న‌ట‌న‌, ఫైట్లు, డ్యాన్సుల‌తో మెప్పించానా ద‌ర్శ‌కుడిగా మాత్రం ర‌వికుమార్ ఫ‌ట్ అయ్యాడు. సెకండాఫ్ మ‌రీ రొటీన్, క‌థ‌నం ప్లో దెబ్బ‌తింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: