సినిమాల్లో నటించే ప్రతి ఒక్కరికీ ఒక్కో మేనరిజం.. స్టైల్ ఉంటాయి. అదే హీరోలకైతే మరీను. అలా ఉండకపోతే అభిమానులకు నచ్చదు. స్టార్ హీరోలు అభిమానుల కోసమే ముందుగా ప్రిపేర్ అవుతారు. వారికి కావాల్సిన అంశాలు ఉంటున్నాయో లేదో చూసుకుని సినిమాలు చేస్తారు. ఇది ఎప్పటినుంచో ఉన్నదే. కానీ అంతే సమానంగా కుటుంబ ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయాల్సిన అవసరముంది. నందమూరి నటసింహం బాలకృష్ణ చేయాల్సింది ప్రస్తుతం ఇదే అంటున్నారు.

 

 

కేవలం అభిమానులను దృష్టిలో పెట్టుకుని సినిమాలో భారీ డైలాగులు, ఫైట్లు, పాటలు పెట్టేస్తే ప్రేక్షకులు ధియేటర్లకు వచ్చి సినిమాలు చూసే రోజులు పోయాయి. వారికి కావాల్సిన స్టఫ్ సినిమాలో ఉందని తెలిస్తేనే ధియేటర్లకు వస్తున్నారు. బాలయ్య ఈ లాజిక్ పూర్తిగా మిస్సవుతున్నాడనే టాక్ వస్తోంది. ధియేటర్ అదిరిపోయే డైలాగులు చెప్తే అభిమానుల నుంచి ఈలలు, చప్పట్లు వస్తాయే కానీ.. ప్రేక్షకులను ధియేటర్లకు రప్పించవు, డబ్బులు తెప్పించవు. పాత కథలను కొత్తగా చెప్పే సత్తా ఉన్న డైరక్టర్లున్నా వాటిని ఆదరించే ఓపిక నేటి ప్రేక్షకులకు లేవు. బాలయ్య ఇంకా అదే ఫార్ములాతో వెళ్తే ఎలా అని అభిమానులే ఆలోచించే పరిస్థితులు వస్తున్నాయి. టెక్నాలజీతోపాటు టేకింగ్ కూడా మారాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అభిమానులే సినిమాను కాపాడలేరు కదా!

 

 

నిజానికి బాలయ్య గతంలోనే కొత్త ఫార్ములా సినిమాలు చేసాడని చెప్పాలి. ఈమధ్య కాలంలోనే ఇలాంటి పాత రొట్టకొట్టుడు విధానానికి అలవాటు పడిపోయాడని చెప్పాలి. జైసింహ, డిక్టేటర్, లయన్, శ్రీమన్నారాయణ, పైసా వసూల్.. ఈ సినిమాలన్నింటిలో ఒకటే ఫార్ములా ఉండటంతో ఏవీ బాలయ్య స్టామినాకు తగ్గట్టు విజయవంతం కాలేదు. ఇక్కడ దర్శకులను కూడా తప్పు పట్టాల్సిందే. వచ్చిన అవకాశాన్ని, బాలయ్యను డిఫరెంట్ గా చూపించే ఆలోచన చేయకపోవడం బాలయ్యకు కూడా ఫ్లాపులను తెచ్చిపెడుతోందనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: