బాలయ్య బాబు హిరొగా హ్యాపి మూవీస్ బ్యానర్ పై సి కళ్యాణ్ నిర్మించిన చిత్రం "రూలర్". కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలకి ముందు ఈ చిత్రానికి ఎలాంటి బజ్ ఏర్పడలేదు. బాలయ్య అభిమానులకి ఉత్సాహం ఉన్నప్పటికీ, కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా అనడంతో ఎలాంటి అంచనాలు ఏర్పడలేదు. అందువల్ల ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఎక్కువ అవలేదనేది టాక్.

 

అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ సమ్గతి పక్కన పెడితే ఈ రోజు విడుదల అవుతున్న చిత్రాలన్నింటిలోకి తక్కువ బజ్ తో విడుదల అయిన చిత్రం ఇదొక్కటే. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాతైనా ఏమైనా బజ్ ఏర్పడుతుందని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. సినిమా చాలా పాతచింతకాయ పచ్చడి మాదిరిగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా బాలయ్య లుక్ మినహా ఏదీ అంతగా మెప్పించలేదని టాక్.

 

సినిమా కోసం బాలయ్య చాలా కష్టపడ్డాడని అర్థం అవుతోంది. ముఖ్యంగా ఒకానొక పాటల్లో బాలయ్య వేసిన స్టెప్పులు హైలైట్ గా నిలిచాయి. ఇంత వయసులోనూ అంత ఎనర్జిటిక్ గా కనిపించడం అంటే మాటలు కాదు. అలా కనబడడానికి ఎంతో కష్టం దాగుందని అర్థం అవుతుంది. అయితే ఈ సినిమాకి  బాలయ్య పడ్డ కష్టం అంతా వృధా అయినట్టే అని తెలుస్తుంది. కథ పాతదయినా కథనం వీక్ గా ఉండడంతో సినిమా పరిస్థితి అదోలా తయారయింది.

 

సాఫ్ట్ వేర్ లుక్ కోసం పెట్టినంత కథ పైన పెట్టి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేదని అర్థం అవుతుంది. ఏది ఏమైనా బాలయ్య కష్టం బూడిదపాలు అయ్యిందని అర్థం అవుతుంది. మరి తన తర్వాతి సినిమా ద్వారానైనా బాలయ్య తన అభిమానులకి సరైన సినిమా ఇస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: