సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘’. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్‌పై రూపొందిన సినిమాకు మారుతి ద‌ర్శ‌కుడు. సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు.  గ్రామీణ నేపథ్యంలో పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 20న(నేడు) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ నేపథ్యం, కుటుంబ బంధాలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఈ చిత్రంలో మారుతీ ఏదో కొత్తగా చూపించారనే భావన ప్రేక్షకుల్లో కలిగించగలిగారు. మ‌రోవైపు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రూలర్’. హీరోగా బాలయ్యకు 105వ సినిమా. ఈ చిత్రంలో అందాల భామలు వేదిక, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

‘జై సింహా’ తర్వాత  కే.యస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఈ రోజే విడుదలైంది. తెలుగులో ఈ రెండు చిత్రాలు ఎప్పటినుండో రిలీజ్ డేట్ లు ప్రకటించుకుని దాని ప్రకారం షెడ్యూల్స్ వేసుకుని ప్రమోషన్స్ కూడా పూర్తి చేసికొని థియేట‌ర్స్‌లోకి వ‌చ్చాయి. మొదటినుండి ప్రతిరోజూ పండగే, రూలర్ చిత్రాలకు డీసెంట్ క్రేజ్ ఉంది. ఈ రెండు చిత్రాల టార్గెట్ ఆడియన్స్ కూడా వేరు కావడంతో ఒకరి సినిమా విడుదలతో మరొక సినిమాకు ఇబ్బంది లేకుండా పోయింది. 

 

అయితే సాయి ధరంతేజ్ ప్రతి రోజు పండగే సినిమా ఆడుతున్న హైదరాబాద్ థియేటర్ లలో ప్ర‌తి చోట్ల పక్క స్క్రీన్లలో రూలర్ సినిమా కూడా ఆడుతోంది. దీంతో ప్రేక్ష‌కులు ప్ర‌తిరోజూ పండ‌గేలోకి ఫస్టాఫ్ ఇంటర్వెల్‌లో జై బాలయ్య, జై జై బాలయ్య.. కొకో కోలా పెప్సీ.. బాల‌య్య బాబు సెక్సీ.. బాల‌య్య జిందాబాద్ అంటా నినాదాలు చేశారు. కాగా, ఈ సినిమా స్టైలిష్ బిజినెస్ మెన్ గా పోలీస్ ఆఫీసర్ గా అలాగే సాధారణ వ్యక్తిలా బాలకృష్ణ తన నటనతో మరోసారి ఈలలు వేయించుకున్నాడు. ఇక ఈ సినిమా జయసుధ, ప్రకాష్ రాజ్, భూమిక పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయి.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: