మెగా కాంపౌండ్ హీరో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ మారుతి దర్శకత్వంలో నటించిన ‘ప్రతి రోజు పండగే’ సినిమా భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఈ రోజు విడుదలయ్యింది. వరుస పరాజయాలతో కెరియర్ ని కొనసాగిస్తూ 'చిత్రలహరి' సినిమా తో అదిరిపోయే హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ ఆ సినిమాతో కుటుంబకథా ప్రేక్షకులను బాగా అలరించాడు. 'చిత్రలహరి' సినిమాతో సాయి ధరమ్ తేజ్ కి మంచి పేరు రావడం జరిగింది. దీంతో తన నెక్స్ట్ సినిమా అయినా ‘ప్రతి రోజు పండుగే’ సినిమాతో మళ్లీ ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేసి మారుతి దర్శకత్వంలో చేయడం జరిగింది.

 

అయితే విడుదలైన ఈ సినిమాకి అదిరిపోయే టాక్ రావడం జరిగింది. ముఖ్యంగా సినిమా ఫస్టాఫ్ మారుతి తనదైన శైలిలో కామెడీ వెండితెరపై పండించడంతో సినిమా చూసిన ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా సెకండాఫ్ ఓకే...కానీ ఫస్టాఫ్ అంతా లేకపోవడం ఎక్కువగా సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ ఉండటంతో కొద్దిగా బోర్ అనిపించినా ఓవరాల్ గా మాత్రం సినిమా మంచి కామెడీ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాగా ప్రస్తుతం సినిమా హాల్లో సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. సినిమాలో రావు రమేష్ సినిమాకే హైలెట్ అని చెప్పుకోవచ్చు సినిమాలో వచ్చే పంచ్ డైలాగులు టైమింగ్ మరియు కామెడీ సీన్లు అదరగొట్టే రీతిలో స్క్రీన్ పై ప్రెజెంట్ చేసి మారుతి తన దర్శకత్వ శైలి మరోసారి నిరూపించాడు.

 

కామెడీ విషయం లో డైరెక్టర్ మారుతి తీసుకున్న కేర్ కారణంగా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ లో సాగుతుంది. ప్రతీ కారెక్టర్ తో కామెడీ పండించడం లో మారుతి తన విభిన్నత ని చాటుకున్నాడు. ప్రస్తుతం సినిమాకి ఉన్న టాక్ బట్టి చూస్తే ఈ రోజు నుండి వచ్చే సంక్రాంతి పండుగ వరకు పెద్ద సినిమాలు పెద్దగా రిలీజ్ అయ్యే సందర్భాలు లేని నేపథ్యంలో సినిమా వసూళ్లకు డోకా ఉండదు అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 'ప్రతి రోజు పండుగే' తో పాటు రిలీజ్ అయినా మిగతా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తేలిపోవడంతో ‘ప్రతి రోజు పండుగే’ సినిమా యూనిట్ పండగ చేసుకుంటున్నాయి. సినిమాకి కలెక్షన్లు రికార్డు స్థాయిలో వస్తున్నాయి. మరోసారి ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేసి సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజు పండుగే సినిమాతో మెప్పించాడు అని అంటున్నారు సినిమా చూసిన ప్రతి ఒక్కరు. ఫైనల్ గా చూసుకుంటే వచ్చే సంక్రాంతి వరకు 'ప్రతి రోజు పండుగే' సినిమాకు కలెక్షన్లకు డోకా లేదని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: