ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమాల్లో విభిన్నమైన కధ కధనం కనిపిస్తున్నాయి. సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్ లేకుంటే ఎంత పెద్ద హీరోను పెట్టి ఎన్ని కోట్లు పెట్టి తీసిన గాని ఆ సినిమా ప్రేక్షకులతో పాటుగా నటీ నటులకు, నిర్మాతలకు, డైరెక్టర్స్ కు నిరాశనే మిగులుస్తుందని చాలా సార్లు నిరూపించబడింది.. ఇదే కాకుండా ఇప్పుడు 50 ప్లస్ నుండి 60 దాటిన హీరోలు ఎంచుకునే కధల్లో ఉన్న కోణాలను పరిశీలిస్తే కొంతవరకైన ప్రేక్షకులు ఆశించే స్తాయిలో ఉంటున్నాయి.

 

 

కానీ ఇందుకు భిన్నంగా బాలకృష్ణ గారు సినిమాలను ఎంచు కోవడం నిజంగా కొంతమంది అభిమానులకు నిరాశ కలిగిస్తుందట. అదీ గాకుండా బాలయ్య సినిమా అంటేనే వన్‌మేన్‌ షోలా సాగుతుంది. అందుకే ఇతర పాత్రలు సన్నివేశాల గురించి ఎవరూ పెద్దగా స్పందించటం లేదు అనే ఓ టాక్ ఉందట.. ఈ క్రమంలోనే ఓవరాల్‌గా రూలర్‌ ట్విట్టర్ టాక్‌ చూస్తే ఈ సారి కూడా బాలయ్య నిరాశపరిచాడన్న అభిప్రాయమే ఎక్కువగా వ్యక్తమవుతోంది.

 

 

బాలయ్య మార్క్‌ రొటీన్ మాస్‌ యాక్షన్‌, పంచ్‌ డైలాగ్‌లు తప్ప సినిమాలో ఏం లేదంటున్నారు ఆడియన్స్‌.. ఇంతే కాకుండా రూలర్ సినిమాకి మ్యూజిక్ కూడా కాస్త హెల్ప్ అయ్యి ఉంటే బాగుండేది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నా సాంగ్స్ అంతగా వర్కౌట్ కాలేదు. ఇక బాలకృష్ణ తన స్టెప్పులతో మాత్రం అదరగొట్టేశాడని చెప్పవచ్చు. మొత్తానికి రూలర్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో అభిమానులు ఆకట్టుకునే సినిమా అని ఆడియెన్స్ నుంచి టాక్ వస్తోంది. ఫస్ట్ హాఫ్ పై పాజిటివ్ గా ఉన్న కామన్ ఆడియెన్స్ సెకండ్ హాఫ్ తో నిరాశ చెందినట్లు అర్ధమవుతోంది.

 

 

ఇలాంటి విషయాలన్ని బాలకృష్ణ గారు తాను ముందు ముందు చేసే సినిమాల్లో గమనించుకుంటే బాలయ్య అభిమానులైన ఆనందంగా బాలయ్య సినిమా చూస్తారని అనుకుంటున్నారు. లేదంటే బాలకృష్ణ సినిమా చేశాడు అని చెప్పుకోవడానికే తప్పా ప్రేక్షకుల్ని అలరించడానికి ఆయన సినిమాలు పనిచేయవని కొందరి అభిప్రాయమట.. అందుకే అంటున్నారట ప్రజలు. బాలయ్య ఇప్పటికైనా నీ మార్కు మార్చాలయ్యా అని..

మరింత సమాచారం తెలుసుకోండి: