నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రూలర్‌. బాలయ్య సరసన సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు చిరంతన్‌ భట్ సంగీతం అందించాడు. అయితే బాలయ్య బాబు సినిమా ఈరోజు విడుదల అయ్యింది. 

                       

ఈ సినిమాఫై ఎన్నో అంచనాలు పెట్టుకొని బాలయ్య బాబు సినిమాను చూడటానికి వెళ్లిన అభిమానులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య బాబు నువ్వు సూపర్ ఎహే అంటూ సినిమాను సూపర్ హిట్ చేస్తున్నారు. మా బాలయ్య మా బాలయ్య అంటూ థియేటర్ లో ఒకటే అరుపులు.. ఎప్పుడులనే ఒకటే పంచులు.. ఒకటే ఫైట్లతో సినిమా థియేటర్ ని అల్లడిస్తున్నాడు. 

 

వెంకీ మామ వల్ల కొంచం ఎఫెక్ట్ పడిన సినిమా థియేటర్స్ తగ్గినా సినిమాకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గటం లేదు. థియేటర్స్ అన్ని నిండిపోయాయి. ఈ సినిమా చుసిన అభిమానులు వారి రివ్యూని పంచుకుంటూ.. బాలయ్య బాబు బాగా యంగ్ అయ్యాడు.. బాలయ్యగ్గనక రాజమౌళిలాంటోడు తోడైతే కలెక్షన్లు అరాచకం అమ్మ మొగుడిలా ఉంటాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

 

అంటే దీని బట్టి చూస్తే.. బాలయ్య అభిమానులకు రాజమౌళి దర్శకత్వం కావాలి అని అర్థం అవుతుంది. మరి బాలయ్య బాబు రాజమౌలితో సినిమా తీస్తాడు ఏమో చూడాలి. కాగా రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ఆర్ఆర్ఆర్ సినిమా తీస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. మరి ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు అవుతుందో ? ఆ సినిమా రిలీజ్ అవుతుందో.. రాజమౌళితో సినిమా ఎప్పుడు తీస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: