బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రూలర్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. బాలకృష్ణ సరసన వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటి జయసుధ, భూమిక చావ్లా, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. చిరంతన్ భట్ సంగీతం అందించిన ఈ సినిమాను సీకే ఎంటర్టైన్మెంట్స్,  హ్యాపీ మూవీస్ బ్యానర్స్ పై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించారు. ఇక నేడు ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా పై చాలావరకు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వినపడుతోంది. 

 

సినిమాలో బాలకృష్ణ ఫైట్స్, డాన్స్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్ వంటివి తప్పించి మరేమీ లేదని, అలానే ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు కె.ఎస్ రవికుమార్ చాలావరకు విఫలం అయ్యాడని మెజారిటీ ప్రేక్షకులు సినిమాపై పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా రొటీన్ ఫార్ములా కథను ఎంచుకొన్న దర్శకుడు, దానిని మరింతగా అర్థం, పర్థం లేకుండా తెరకెక్కించారని అంటున్నవారు కూడా లేకపోలేదు. ఇకపోతే ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాలయ్య బాబు డాన్స్ తో పాటు ఆయన పలికిన డైలాగ్ లు అని అంటున్నారు. 

 

మొదటి నుంచి కూడా డైలాగ్స్ ను అద్భుతంగా పలికించగల దిట్ట అయిన బాలకృష్ణ, ఈ సినిమాలో కూడా కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఫ్యాన్స్ ని, ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించినట్లు తెలుస్తోంది, కేవలం డైలాగుల కోసమే సినిమా తీసారా అనేలా, అవి తప్పించి సినిమాలో మరేదీ బాగోలేదని, చాలా వరకు ఈ సినిమా యువతను గాని ఫ్యామిలీ ఆడియన్స్  ను గాని ఆకట్టుకునే అవకాశం లేదని అంటున్నారు. ఇక బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా కేవలం ఒక్కసారికి మించి చూడలేని పరిస్థితి నెలకొందని కొందరు చెబుతున్నారు. తొలి రోజు తొలి ఆట నుండి నెగిటివ్ టాక్ ను సంపాదించుకొని సినిమా ముందు ఎంత మేర కలెక్షన్ కొల్లగొట్టి ముందుకు సాగుతుందో చూడాలి....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: