నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా తెరకెక్కిన తాజా సినిమా రూలర్ నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. బాలకృష్ణ మూడు రకాల విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించిన ఈ సినిమాపై చాలా వరకు కూడా నేడు నెగిటివ్ స్పందన వినిపిస్తోంది. సినిమాలో మంచి మాస్,  కమర్షియల్ అంశాలు ఉన్నప్పటికీ, 

 

కథ మరియు కథనాలు ముందుకు సాగే పద్ధతిని బట్టి చూస్తే మనం ఎప్పుడో 15 ఏళ్ల క్రితం చూసిన సినిమాల మాదిరిగా ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు మనకు స్ఫురిస్తాయని అంటున్నారు ప్రేక్షకులు. కేవలం బాలకృష్ణ  గారి అభిమానుల కోసమే దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఈ సినిమా తీశారు అనే విధంగా సినిమాలోని యాక్షన్, హీరో ఎలివేషన్ ఫైట్స్ వంటివి పెట్టడం జరిగిందని మనకు కొంత అర్థం అవుతుందని అంటున్నారు. ఇక ఏమాత్రం ఆసక్తికరంగా సాగని స్క్రీన్ ప్లే తో రొటీన్ సీన్స్ తో సాగే ఈ సినిమాకు అక్కడక్కడ ఒకింత నవ్వించే కామెడీ సీన్స్ యాక్షన్, డైలాగ్స్, పాటలు, డాన్స్ వంటివి మాత్రమే బాగున్నాయని అంటున్నారు. 

 

దర్శకుడు కె.ఎస్ రవికుమార్ ఎప్పుడో కొన్నేళ్ల క్రితం తీసిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా తీశాడు అని, ఇటువంటి సినిమాలు తీస్తే, మున్ముందు ఆయన సినిమాలను చూసే ప్రేక్షకులు కూడా తగ్గిపోతారని అభిప్రాయపడుతున్న వారు కూడా లేకపోలేదు. ఇప్పటికే ఈ ఏడాది రెండు వరుస ఫ్లాప్స్ చవిచూసిన బాలయ్యకు ఈ సినిమా కూడా విజయాన్ని అందివ్వలేదని అంటున్నారు. ఇక మొదటి ఆట నుండి ఈ విధంగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ తో రన్ అవుతున్న రూలర్ సినిమా, రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు సాగుతుందో, సినిమాను కొన్న బయ్యర్లను ఎంతవరకు గట్టెక్కిస్తుందో వేచి చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: