నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన తాజా చిత్రం 'రూలర్'. ‘జై సింహా’ తర్వాత  కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 20(నేడు) విడుదలైంది. బాలయ్య సరసన సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సీకే ఎంటర్టైన్మెంట్స్, హ్యాపి మూవీస్ బ్యానర్స్ పై నిర్మాత సి.కళ్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో మరోసారి బాలయ్య తన నట విశ్వరూపం చూపించాడ‌నే చెప్పాలి. అలాగే ఈ సినిమాకు బాలయ్య టోనీ స్టార్క్ లుక్ తోనే విపరీతమైన క్రేజ్ సంతరించుకుంది.

 

ఫస్ట్ హాఫ్ లో బాలయ్యపై వచ్చే మేకోవర్ సీన్స్ మరియు కొన్ని మార్క్ పంచ్ డైలాగ్స్.. బాలయ్య నుంచి ఏమైతే కోరుకొని థియేటర్ కు జనం వాస్తారో వారికి ఫుల్ మీల్స్ లా ఉంటుంది. ఇలా బాలయ్య సరికొత్త మేకోవర్, కొన్ని యాక్షన్ సీన్స్ మ‌రియు ఇంటర్వెల్ బ్లాక్ లోని కొన్ని సీన్స్ & డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇక మొదటి నుంచి కూడా డైలాగ్స్ ను అద్భుతంగా పలికించగల దిట్ట అయిన బాలకృష్ణ, ఈ సినిమాలో కూడా కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఫ్యాన్స్ ని, ప్రేక్షకుల్ని ఆక‌ట్టుకున్నాడు.

 

ఓవ‌రాల్‌గా బాల‌య్య త‌న న‌ట‌న‌, ఫైట్లు, డ్యాన్సుల‌తో మెప్పించానా ద‌ర్శ‌కుడిగా మాత్రం ర‌వికుమార్ ఫ‌ట్ అయ్యాడు. ఎందుకంటే సినిమాలో బాలకృష్ణ ఫైట్స్, డాన్స్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్ వంటివి తప్పించి మరేమీ లేక‌పోవ‌డం..  అలానే ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు కె.ఎస్ రవికుమార్ చాలావరకు విఫలం అయ్యాడ‌నే చెప్పాలి. కాగా, బాలయ్య గత రెండు చిత్రాలు ఎన్టీఆర్ బయోపిక్ నిరాశ పరచడంతో ‘రూలర్’ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. కానీ.. ద‌ర్శ‌కుడు ర‌వికుమార్ మాత్రం అటు అభిమానుల‌ను.. ఇటు ప్రేక్ష‌కుల‌ను నిరాశ ప‌రిచార‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: