మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా, రాశీఖన్నా హీరోయిన్ గా తెరకెక్కిన ప్రతిరోజూ పండగే సినిమా ఈరోజు విడుదలైంది. మొదటి నుండి తన సినిమాలో కామెడీ మిస్ కాకుండా సినిమాలను తెరకెక్కిస్తున్న మారుతి ప్రతిరోజూ పండగే సినిమాతో థియేటర్లలో ప్రేక్షకులు పడీ పడీ నవ్వేలా చేశాడు. ఎమోషన్స్ తో పాటు కామెడీపై ప్రధానంగా దృష్టి పెట్టిన మారుతి కామెడీ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించాడు.
 
సినిమాలోని కొన్ని కామెడీ ట్రాక్స్ హిలేరియస్ గా వర్కౌట్ అయ్యాయి. కామెడీ మోతాదు ఎక్కువ కావడంతో సగటు సినీ ప్రేక్షకులను కూడా ప్రతిరోజూ పండగే సినిమా అలరిస్తుంది. చాలా చిన్న పాయింట్ చుట్టూ తిరిగే కథను మారుతి రెండున్నర గంటల పాటు కడుపుబ్బా నవ్విస్తూ అదే సమయంలో ఎమోషన్స్ మిస్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. రావు రమేష్ పాత్ర తనకు మాత్రమే సొంతమైన కామెడీ టైమింగ్ తో, ప్రత్యేకమైన మేనరిజంలతో అలరిస్తుంది. 
 
రావు రమేష్ పాత్ర సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలిచింది. ఆ పాత్రతో దర్శకుడు మారుతి పంచిన వినోదం అంతా ఇంతా కాదు. రాశీ ఖన్నా ఏంజెల్ అర్ణ పాత్రలో కామెడీ బాగానే పండించింది. సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నాల మధ్య వచ్చే కామెడీ ట్రాక్స్ భలే కుదిరాయి. సుప్రీం సినిమాతో హిట్ జోడీ అనిపించుకున్న సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా ఈ సినిమాతో మరోసారి ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేయడం గమనార్హం. 
 
ప్రేక్షకుల నుండి దర్శకుడు మారుతి సినిమాలో కామెడీ, ఎమోషన్స్ అద్భుతంగా పండించాడని ప్రశంసలు వినిపిస్తున్నాయి. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాలను కామెడీతో హిట్ చేసిన మారుతి ఈ సినిమాను కూడా తన కామెడీతో విజయతీరాలకు చేర్చాడు. స్క్రీన్ ప్లే కొత్తగా లేకపోయినా కామెడీతోనే సినిమాను మారుతి నిలబెట్టాడు. కామెడీ పరంగా మారుతి సెన్సాఫ్ హ్యూమర్ ఎలా ఉంటుందో ఎంత ట్రెండీగా మారుతి ఆలోచిస్తాడో ఈ సినిమాలోని కామెడీ సన్నివేశాలను చూస్తే అర్థమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: