నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రూలర్‌. బాలయ్య సరసన సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు చిరంతన్‌ భట్ సంగీతం అందించాడు. అయితే బాలయ్య బాబు సినిమా ఈరోజు విడుదల అయ్యింది. 

              

ఈ సినిమాఫై ఎన్నో అంచనాలు పెట్టుకొని బాలయ్య బాబు సినిమాను చూడటానికి వెళ్లిన అభిమానులు ఓ రేంజ్ లో నవ్వుకుంటున్నారు. ఏందయ్యా ఈ కామెడీ... ఫైట్స్ కూడా కామెడీలా తీసేశావు అంటూ కామెడీ చేస్తున్నారు. ఒక్క గుద్దు గుద్దితే చాలు కార్ లేచిపోతుంది. హీరో ఎంత గ్రేట్ అయితే మాత్రం ఒక్క గుద్దుకే కార్ అద్దాలు అన్ని పగిలిపోతాయి ఇన్ని వింతలు ఎక్కడైనా ఉంటా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

      

అంతేకాదు.. బాలయ్య వయసు ఏంటి ? ఆ మేకప్ లు ఏంటి ? అని ఒకరు కామెంట్ చేస్తే మరికొందరు స్పందిస్తూ మా బాలయ్యకేందీ మేకప్పు, గెటప్పూ రవికుమారా అంటు నందమూరి అభిమానులు మండిపడుతున్నారు. ఎందుకు ఈ వయసులో కూడా ఆయనను ఆలా ఇబ్బంది పెడుతావ్ అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఏది ఏమైనా బాలయ్య బాబుకు ఇంత వయసు వచ్చిన కథలు ఎంచుకునేకి రాదు అని మరికొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

 

కాగా ఈ సినిమాలో బాలయ్య బాబుకు రియల్ బాలయ్య బాబుకు చాల తేడాలు ఉన్నాయి. అసలు అక్కడ ఉన్నదీ బాలయ్య బాబు ఏ నా అనే ఆశ్చర్యం అందరికి కలిగేలా దర్శకుడు చూసుకున్నాడు. కానీ ఆ మార్పు మాకు నచ్చలేదు అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: