నందమూరి బాలకృష్ణ హీరోగా తెర‌కెక్కింన 105వ‌ చిత్రం ‘రూలర్’.  ‘జై సింహా’ తర్వాత  కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంఈ రోజే విడుదలైంది. బాలయ్య సరసన సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. చిరంతన్‌ భట్ సంగీతమందించాడు. ఈ సినిమాను సీకే ఎంటర్టైన్మెంట్స్, హ్యాపి మూవీస్ బ్యానర్స్ పై నిర్మాత సి.కళ్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ ఏడాది రెండు ప్లాపులతో డీలాపడ్డ బాలకృష్ణ రూలర్ సినిమాతో నందమూరి అభిమానుల‌కు కిక్ ఇద్దామ‌నుకున్నాడు. కానీ.. అది పెద్ద‌గా వ‌ర్కోట్ అయిన‌ట్టు క‌నిపించ‌డం లేదు.

 

ఫ‌స్టాఫ్‌లో కాస్త‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగినా సెకండ్‌ హాఫ్‌లో మాత్రం దర్శకుడు నిరాశపరిచాడన్న టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా రొటీన్‌ స్టోరి, టేకింగ్‌లతో బోర్‌ కొట్టించాడు. లెంగ్తీ సీన్స్ కూడా సెకండ్‌ హాఫ్‌లో ఆడియన్స్‌ను ఇబ్బంది పెడతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాలయ్య గెటప్ చేంజ్ లోనే కొత్త కథనం వచ్చేసింది అనే వెర్రితనంలో స్క్రీన్ ప్లే రాసినట్టు ఉంటుంది. ఓవరాల్ గా కథ – కథనం విషయంలో పూర్ మెటీరియల్ అనిపించాడు. ఇకపోతే ఆ కథని జడ్జ్ చేయడంలో కెఎస్ రవికుమార్ కూడా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే ఆయనే ఇలాంటి సినిమాలు గతంలో చేశారు. అలాంటి డైరెక్టర్ మళ్ళీ అలాంటి కథ ఎంచుకోవడం బాధాకరం. 

 

ఇక మేకింగ్ పరంగా వీలైనంత బెటర్ అవుట్ ఫుట్ ఇచ్చి ఆ బొక్కల్ని కవర్ చేయాలనీ ట్రై చేసాడు. అది ఫస్ట్ హాఫ్ వరకూ మేనేజ్ చేసినా సెకండాఫ్ లో చేతులెత్తేశాడు. సెకండాఫ్ కి ప్రేక్షకులు పిచ్చ బోర్ గా ఫీలవుతున్నారు. కేవలం ఫ్యాన్స్ కోసమే బాలయ్యకు మాస్ ఫైట్స్, యాక్షన్ సీన్స్ ని దర్శకుడు అవి డిజైన్ చేశాడా అనేలా ఉన్నాయి. మొత్తంగా చూసింకుంటే.. పాత చింత‌కాయ ప‌చ్చ‌డి క‌థ‌.. బోరంగ్ క‌థ‌నంతో ప్రేక్ష‌కుల‌ను ఇబ్బంది ప‌డేలా చేసిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా బాల‌య్య అభిమానులు మెప్పించినా.. ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డం కాస్త క‌ష్ట‌మే మ‌రి. ఇక మొద‌టి నుంచి యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్న రూల‌ర్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు సాగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: