బాలయ్య బాబు కథానాయకుడిగా కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "రూలర్" ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా ఎలా ఉన్నప్పటికీ సినిమాలో బాలయ్య లుక్ గురించి ఎక్కువ టాక్ నడుస్తుంది.  ఒక సినిమాలో హీరో లుక్ గానీ, హీరోయిన్ లుక్ గానీ బాగా కనబడాలంటే దర్శకుడు కొంచెం కృషి చేయాల్సి ఉంటుంది. సినిమాలో వారిని ఎలా చూపించాలని అనుకుంటున్నారో వాళ్ళకో ఐడియా ఉంటే ఆ లుక్ బాగుంటుంది.

 

సినిమాల్లో హీరో బాగున్నాడంటే దర్శకుడే కారణం. అలాగే బాగాలేకుంటే కూడా దర్శకుడే కారణం. ఎందుకంటే సినిమా అనేది మొత్తం దర్శకుడి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత దర్శకుడిదే అని చెప్పక తప్పదు. ప్రస్తుతం రూలర్ సినిమాలో బాలయ్య గెటప్ ల గురించి చర్చ ఎక్కువ నడుస్తుంది. సాఫ్ట్ వేర్ టోనీ స్కార్ట్ గా అల్ట్రా స్టైలిష్ గా కనిపించిన బాలయ్య పోలీస్ ఆఫీసరు పాత్రలో అస్సలు బాగా లేడు. అ లుక్ ఏమాత్రం సరిగ్గా సెట్ అవలేదు.

 

సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా ఎంతో స్టైలిష్ గా చూపించిన కే  ఎస్ రవికుమార్ పోలిస్ ఆఫిసరు పాత్రలో అలా ఎందుకు చూపించాడన్నది ఎవరికీ అర్థం కావట్లేదు.  అసలు ఆ లుక్ ఎందుకు ట్రై చేశారన్నది ఎవరికీ అంతు పట్టడం లేదు. సినిమా రిలీజ్ ముందు ఈ పాత్ర లుక్ మీద అందరికీ ఒకరమైన ఆందోళన ఉండింది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక ఆ లుక్ చూసి ఏమాత్రం బాగాలేదని పెదవి విరుస్తున్నారు.

 

ఒకే సినిమాలో ఒక గెటప్ సూపర్ సక్సెస్ అయి, మరో గెటప్ ఫ్లాప్ అవడం అంటే తప్పు దర్శకుడిదే అని చెప్పక తప్పదు. బాలయ్య అభిమనులకి సైతం ఈ గెటప్ నచ్చట్లేదు. మరి ఈ విషయమై దర్శకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: