దాదాపు 20 సంవత్సరాల క్రితం సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు పోటాపోటీగా రిలీజయ్యేవి. చిరంజీవి సినిమా హిట్ అయితే బాలకృష్ణ సినిమా అంతకు మించి హిట్ అయ్యిది. బాలకృష్ణ సినిమా హిట్ అయితే చిరంజీవి అంతకు మించిన హిట్ కొడుతూ ఇద్దరి మధ్య పోటీ ఉండేది. కానీ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాల తరువాత బాలకృష్ణ కథల ఎంపికలో చాలా పొరపాట్లు చేశాడు. 
 
లక్ష్మీ నరసింహా హిట్ తరువాత 6 సంవత్సరాలు ఫ్లాపులతో సతమతమైన బాలయ్యకు సింహా రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఆ తరువాత కొన్ని ఫ్లాపులు వచ్చినా లెజెండ్ సినిమాతో బాలయ్య మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమాలు బాలయ్య స్థాయికి దరిదాపుల్లోకి కూడా రావటం లేదని ప్రేక్షకుల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
సరైన కంటెంట్ ఉన్న సినిమా పడితే కొత్త రికార్డులు సృష్టించే స్టామినా బాలయ్యకు సొంతం. బాలకృష్ణ సినిమాకు హిట్ టాక్ వస్తే చాలు సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ ఈ మధ్య కాలంలో సినిమాల్లో గెటప్పులు మారుస్తున్నాడు కానీ రొటీన్ యాక్షన్ సినిమాలనే ఎంచుకుని తప్పు చేస్తున్నాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో బాలయ్య ఎంచుకుంటున్న కథలు కూడా బాలయ్య స్థాయిలో లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
బాలకృష్ణ ఇకముందైనా రొటీన్ మూస మాస్ కథల జోలికి పోకుండా నవ్యత ఉన్న కథలను ఎంచుకోవాలని అభిమానులు కోరుతున్నారు. దర్శకుల విషయంలో కూడా బాలయ్య జాగ్రత్త వహించాలని అభిమానులు కోరుకుంటున్నారు. సింహా, లెజెండ్ లాంటి హిట్లు ఇచ్చిన బోయపాటి మాత్రమే బాలకృష్ణను సరిగ్గా హ్యాండిల్ చేయగలడని బాలకృష్ణ స్టార్ డైరెక్టర్లకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలని ఫ్యాన్స్ నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య ఇకముందైనా తన స్థాయికి తగినకథలు ఎంచుకుంటాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: