‘చిత్ర‌ల‌హ‌రి’ డీసెంట్‌ స‌క్సెస్ త‌ర్వాత హీరో సాయితేజ్ న‌టించిన చిత్రం `ప్ర‌తిరోజూ పండ‌గే`.  మంచి హిట్ కోసం వేచి చూస్తున్న ద‌ర్శ‌కుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రంలో రాశి ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్కేఎన్ సహ నిర్మాత. గ్రామీణ నేపథ్యంలో పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక సినిమాలో సాయి ధ‌ర‌మ్ తేజ్.. రాశీ ఖ‌న్నా ఎంతో చ‌క్కగా కామెడీని పండించారు.

 

అయితే ఫ‌స్టాఫ్‌లో మాత్రం క‌థ సంబంధం లేకుండా కామెడీని లాకొచ్చాడు మారుతి. ఇక‌ పెద్ద కథేమీ లేకపోవడం.. సన్నివేశాలు రిపిటీటివ్ గా తయారవడం.. మొదట్లో చెప్పుకున్న తరహాలో కామెడీ కోసమని మరీ హద్దులు దాటిపోవడంతో ‘ప్రతి రోజూ పండగే’ గ్రాఫ్ ఫ‌స్టాఫ్‌లో పడిపోతూ వెళ్తుంది. ఫ‌స్టాఫ్‌లో ఎంత మారుతి టైంపాస్ చేయించినా.. సెకండాఫ్‌లో కథంటూ లేకుండా  సినిమాను నడిపిస్తే ప్రేక్షకుడికి విసుగు పుడుతుంది. ఇక‌ రెండో భాగం సాగ‌దీత ఎక్కువ ఉంటుంది. అసలేమాత్రం మలుపుల్లేకపోవడం నిరాశ పరుస్తుంది. అలాగే ఎన్నారైల పాత్రల్ని ఇందులో మరీ నెగెటివ్ గా.. కృత్రిమంగా తయారు చేసి పెట్టారీ సినిమాలో. 

 

అయితే లాజిక్ గురించి పట్టించుకోకుంటే సెకండాఫ్‌లోనూ కొన్ని సన్నివేశాలు బాగానే నవ్విస్తాయి. ఇక పిల్లలు వివిధ కారణాలతో పెద్దలకు దూరమవుతారు. అటువంటి వారంతా ఒక దగ్గరకు చేరితే ఎలా ఉంటుంది అనేది బాగున్నా..పిల్లలందర్నీ స్వార్థపరులు అనేలా చూపించిన విధానం కొంత బాగోలేదు. కామెడీగా కథను నడిపించేయడంతో ఈ లోపం కనిపించదు. ఇక క్లైమాక్స్ కొంచెం బాగా చేసి ఉంటె బావుండేది కానీ, మారుతి కామెడీకి పెద్ద పీట వేయడంతో క‌థ‌ అలా అలా అయిపొయింది అంతే అని చెప్పుకోవాలి. కాగా, ఈ సినిమాకు సాయి ధరమ్ తేజ్, సత్యరాజ్ న‌ట‌న ప్ల‌స్ అయింద‌ని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: