మెగాహీరో సాయిధరమ్ తేజ్  హీరోగా నటించిన ప్రతి రోజు పండగే సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ప్రతి రోజు పండగే సినిమాలో  సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సరసన రాశిఖన్నా నటించింది. ఇక ఈ సినిమాలో  ముఖ్య పాత్రలో విలక్షణ నటుడు సత్యరాజ్ నటించారు. ఈ సినిమాని దర్శకుడు మారుతి తెరకెక్కిస్తుండగా ... గీత ఆర్ట్స్ యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కాగా నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తో దూసుకుపోతుంది. కామెడీ ఎంటర్టైనర్ వినోదభరితంగా సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సినిమాలు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మరోసారి తన కామెడీ టైమింగ్ తో ఇరగదీశాడు. 

 


 ఇక ఈ సినిమాలు కీలక పాత్రలో నటించిన రావు రమేష్ కూడా తన నటన తో అదరగొట్టేశాడు. కథానాయకుడిగా నటించిన రాసి కన్నా కూడా టిక్ టాక్ కి  ఎడిక్ట్  అయినా అమ్మాయిగా  అందరిని ఆకర్షించింది. అయితే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న తాతని చివరి క్షణాల్లో ఆనందంగా ఉంచాలనే ఉద్దేశంతో విదేశాల్లో ఉన్న మనవడు రాజమండ్రి వచ్చి కుటుంబాన్ని మొత్తం ఒక్క చోట  చేర్చేందుకు చేసే ప్రయత్నమే ప్రతి రోజు పండగే సినిమా. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో  దర్శకుడు మారుతి అన్ని సరైన పాళ్లలో దట్టించి తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటు అందరినీ కడుపుబ్బ నవ్వించటమే  కాదు ఫ్యామిలీ సెంటిమెంటుతో అందరిని కట్టిపడేస్తుంది కూడా. 

 

 గతంలో ఫ్లాపులతో సుప్రీమ్ హీరో సాయి ధరంతేజ్ కెరియర్ అయోమయంలో పడింది.అయితే చిత్రలహరి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సాయి ధరంతేజ్. ఇప్పుడు ప్రతి రోజు పండగే సినిమా కూడా విజయం వైపు గా దూసుకుపోతుంది. దీంతో సాయి ధరంతేజ్ ఖాతాలో మరో విజయం నమోదు అయినట్లయింది. ఇక సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ గాడిలో పడినట్లే కనిపిస్తోంది. అయితే ఈ సినిమాలో అద్భుతమైన కామెడీ దట్టించాడు  దర్శకుడు మారుతి. మామూలుగా మారుతి సినిమాలంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా  కామెడీ తో కూడుకొని ఉంటాయి  ఇక ఈ సినిమా కూడా అలాగే ఉంది. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్  విషయంలో కూడా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు అన్ని సమపాళ్లలో దట్టించి.. ఒక మంచి కుటుంబ కథా చిత్రంగా ప్రతి రోజు పండగే సినిమాను తెరకెక్కించారు. దీంతో కామెడీ కుటుంబం కోసం అయినా ప్రతి రోజు పండగే సినిమా చూసేయొచ్చు అనుకుంటున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: