హాలీవుడ్‌ చిత్రాలు చూసే ప్రేక్షకులకు దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ పేరు పరిచయమే.  ‘ది డార్క్‌ నైట్‌’, ‘ఇన్‌సెప్షన్‌’, ‘ది డార్క్‌ నైట్‌ రైజెస్‌’, ‘ఇంటర్‌స్టెల్లార్‌’, ‘డంకర్క్‌’ చిత్రాలతో ప్రేక్షకుల్లో అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ప్ర‌స్తుతం హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో రాబర్ట్ పాటిసన్ ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `టెనెట్‌`. ఈ చిత్రంలో బాలీవుడ్ వెటరన్ నటి డింపుల్ కపాడియా కూడా నటిస్తుంది. ప్రఖ్యాత వార్నర్ బ్రదర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది. వచ్చే ఏడాది జులై 17న టెనెట్ చిత్రం విడుదల కాబోతోంది. 

 

అయితే తాజాగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ విడుద‌ల చేశారు.  ట్రైలర్ ఆరంభంలో ఒక ఆకాశాన్ని తాకే ఒక బిల్డింగ్ లోకి బైటనుంచి తాడుతో హీరో.. మరో వ్యక్తి ఎంటర్ అవుతారు.  నెక్స్ట్ సీన్స్ లో హీరో ను చంపేస్తారు.  సీన్ కట్ చేస్తే `నువ్వు పాస్ అయిన టెస్ట్ ఎవరూ పాస్ అవ్వలేరు.  మరణానంతర జీవితానికి స్వాగతం`  ల్యాబ్ లో ఒక వ్యక్తి  హీరోతో చెప్తారు. ఇక మరో సీన్ లో హీరో `నేను చేసే పని చేయాలంటే నేనేం పని చేస్తున్నానో నాకు తెలియాలి` అంటూ కండిషన్ పెడ‌తాడు. అప్పుడు ఒక మహిళ `నాకు తెలిసినంత వరకూ మనం మూడవ ప్రపంచయుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాం` అంటుంది.  

 

అలాగే హీరోకు 'టెనెట్' అనే పదం మాత్రం హింట్ గా చెప్తారు. అస‌లు హీరోకు ఎలాంటి మిషన్ అప్పగించారు..అసలు మిషన్ అప్పగించారా లేక ఇరికించారా? ఒకవేళ మిషన్ నిజమే అయితే అదేంటి? అన్న ప్ర‌శ్న‌ల‌కు సినిమా చూస్తే కానీ తెలియ‌దు. రెండు నిమిష‌ల ప‌ది సెకెండ్ల న‌డివి ఉన్న ఈ ట్రైల‌ర్ హాలీవుడ్ ప్రియుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తోంది. కాగా, ఈ సినిమాకి నోలన్, అతడి భార్యా ఎమ్మ థామస్ మరియు వార్నర్ బ్రదర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో జాన్ డేవిడ్ వాషింగ్టన్,  ఎలిజబెత్ డెబికి, ఆరోన్ టేలర్-జాన్సన్, క్లెమెన్స్ పోయసీ, మైఖేల్ కెయిన్, కెన్నెత్ బ్రానాగ్, డింపుల్ కపాడియా మరియు హిమేష్ పటేల్ నటిస్తున్నారు.

 

  
 

మరింత సమాచారం తెలుసుకోండి: