తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు వారసునిగా సినీరంగ ప్రవేశం చేసిన బాలకృష్ణగారు. తండ్రికి తగ్గ తనయుడు అని నటనలో అనిపించుకున్నాడు.. కాని చాలా సందర్బాల్లో తడబడ్డారు అని ఒక వార్త. ఇకపోతే ఎన్.టి.ఆర్, జీవితం ఎందరో నటులకు ఆదర్శం. ఎందుకంటే ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తన సొంతం చేసుకున్నారు..

 

 

ఆ కాలంలోనే  ఎన్.టి.రామారావు.  తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఆయన, అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు.

 

 

తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు 44 పౌరాణిక చిత్రాలు చేసారు. రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసాడు. పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచాడు.

 

 

ఇంతటి మహోన్నతుడి వారసుడిగా బాలకృష్ణగారు తన సినీ ప్రస్దానంలో సాధించింది ఏమిటనేది పరిశీలిస్తే అర్ద భాగం కూడా కనిపించదు. ఇక ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా కచ్చితంగా ఉండేవాడు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడు కోవడానికి ప్రతిరోజూ మద్రాసు మెరీనా బీచిలో అభ్యాసం చేసేవాడు. నర్తనశాల సినిమా కోసం ఆయన వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నాడు. వృత్తిపట్ల ఆయన నిబద్ధత అటువంటిది.

 

 

కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని చెబుతూంటారు, ఎందుకంటే ఆయన డైలాగులను ముందుగానే కంఠతా పట్టేసేవాడు. అందుకే గొప్ప నటుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు.. అంతే కాదు ముప్పై మూడేళ్ళ తెర జీవితంలోను, పదమూడేళ్ళ రాజకీయ జీవితం లోను నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడు.. ఇక బాలాకృష్ణను తీసుకుంటే రాజకీయంగా విఫలమయ్యాడనే అంటున్నారు.

 

 

ఇక నటన పరంగా ఒకప్పటి చరిష్మా ఇప్పుడు కనపరచడం లేదని అభిమానులు వాపోతున్నారు. ఏది ఏమైనా కొంతలో కొంతైనా తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలంటే అన్న ఎన్టీఆర్ ను బాలయ్య ఇన్సపిరేషన్ గా తీసుకోవాలి అని బాలయ్య అంటే అభిమానం ఉన్నవారు అభిప్రాయ పడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: