బాలయ్య సినిమాలకు ఒకప్పుడు స్పెషల్ ఆడియన్స్ ఉండేవారు. ఆయన చెప్పే పంచ్ డైలాగ్స్ కు, తొడ కొట్టే సీన్స్ కు, ఒకటే కేకలతో, విజిల్స్‌తో థియేటర్స్ దద్దరిల్లేవి. ఆ శతకం ముగిసింది. ఇప్పుడున్న కొత్త జనరేషన్ లో కొద్ది మంది మాత్రమే ఆయన వైపుకు టర్న్ అయ్యారు. మిగతావాళ్లు సినిమా బాగుంటేనే బాలయ్య కైనా మరొకరి సినిమా కైనా జై కొడుతున్నారు. అది జై సింహా కావచ్చు. ఎన్టీఆర్ బయోపిక్ కావచ్చు. లెజెండ్ ఇలా ఇంకా మరేదైనా కావచ్చూ..

 

 

ఇకపోతే ఇప్పటి పరిస్దితులు ఎలా ఉన్నాయంటే ఏదైమైనా సినిమా నచ్చితే నాలుగు టిక్కెట్లు తెగుతున్నాయి. నచ్చకపోతే మార్నింగ్ షో కే బై చెప్పేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో బాలయ్య విభిన్నమైన కథాంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఇటువంటి పరిస్దితుల్లో వచ్చిన రూలర్...ఈ తరాన్ని ఎంతవరకూ ఎంగేజ్ చేయగలిగాడు అంటే ఒకరకంగా యూత్ నాడి పట్టుకోవడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చూ. ఎందుకంటే సినిమా రంగంలో ఎనలేని అనుభవం ఉన్నా, ఇప్పటి వరకు ఎన్నో హిట్లు, ఫ్లాపులు చూసిన బాలయ్యకు ఎవరు కొత్తగా నేర్పవలసిన అవసరం లేదు.

 

 

ఈ మధ్య కాలంలో వచ్చే కుర్ర హీరోలు సైతం కధ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని రకాలుగా ఆలోచించే సినిమా చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి టఫ్ కాంపిటెషన్ ఉన్న సమయంలో బాలకృష్ణ సినిమా అంటే ఆయన అభిమానుల ఆలోచనల్లో బాలయ్య సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. ఇకపోతే బాషా, సమర సింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర ఇలా ఏ కథ చూసుకున్నా.. ఇంటర్వెల్ దగ్గర .అప్పటిదాకా ఓ ఐడెంటిటీతో బ్రతికిన హీరో అసలు జీవితం వేరు అని రివీల్ అవటం..

 

 

ఆ కథేంటో తెలియటం..ఇది అందరికీ బాగా తెలిసిన స్క్రీన్ ప్లే. ఎన్ని సార్లు ప్లే చేసినా పాసై పోతూ వస్తోంది. కలిసొస్తే పెద్ద హిట్ అవుతోంది. లేదంటే పీల్చేసిన సిగరేట్ పిలికలా మిగిలిపోతుంది. ఇదే ఫార్ములాను ఈ సినిమాకు వాడారు. అంతే కాకుండా ఈ సినిమాలో ఉన్న ఒక పాయింట్ అల్లు శిరీష్ డెబ్యూ మూవీ గౌరవం సినిమాను అచ్చం అలాగే కాపీ కొట్టారనిపిస్తుంది. ఇలా బాలయ్య రూలర్ సినిమాను మొత్తం తన పాత సినిమాల నుంచి కాపీ కొట్టాడు చివరకు పరువుహత్య అనే పాయింట్ అల్లు శిరీష్ సినిమా నుంచి తీసుకొచ్చి ఇందులో పెట్టాడు అంతా రోట్లో పెట్టి రుబ్బేసాడు దర్శకుడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: