నటసింహం నందమూరి బాలకృష్ణ 105వ సినిమాగా  భారీ అంచనాల మధ్యన తెరకెక్కిన రూలర్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పుడు లేని విధంగా రూలర్ లో బాలయ్య గెటప్ కాస్త కొత్తగా అనిపించడంతో అటు బాలయ్య ఫ్యాన్స్ తో పాటుగా ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో ఒక్క బాలయ్య ఫ్యాన్సే కాదు చాలామంది కామన్ ఆడియన్స్ కూడా రూలర్ సినిమాను చూసేందుకు ఆతృతగా థియేటర్లకు వెళ్లారు. కానీ ప్రేక్షకులకు మాత్రం నిరాశే మిగిలింది. అందుకు ముఖ్య కారణం మన బాలయ్య రూలర్ సినిమా కంప్లీట్ రొటీన్ సినిమాగా, ఆసక్తి లోపించి జనాలందరికి పరమ బోర్ అనిపించింది. నటన విషయంలో బాలయ్య గురించి తెలిసిందే...గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్తారు. 

 

కాని అసలు కథ.. కథనం ఉండాలి కదా. ఈ విషయంలోనే రూలర్ సినిమా జాడీలో పెట్టిన పాత చింతకాయ పచ్చడి మాదిరిగా బాలయ్య గత చిత్రాలను గుర్తు చేస్తోంది. గతంలో బాలకృష్ణ సినిమాలకి రూలర్ కి పెద్ద తెడా లేదు. దాంతో థియొటర్స్ లో ప్రేక్షకులకు చిర్రెత్తుకొస్తుంది. ఏంట్రా ఈ అరాచకం అనేలా ఫ్యాన్సే ఫీలవుతున్నారు. ముఖ్యంగా బాలయ్య పోలీస్ గెటప్ లో ఏమాత్రం మెప్పించలేకపోయారు. ఇంతకముందు లక్ష్మీ నరసింహ సినిమాలో బాలయ్య పోలీస్ గెటప్ లో ఏ రేంజ్ లో ఇరగదీశాడో రూలర్ లో మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాడు.

 

అందుకే ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపు పరమ బోరింగ్ గా ఫీల్ అవుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం అర్థమవుతోంది. ఈ సినిమాని కేవలం బి సి సెంటర్స్.. ప్రేక్షకులకోసమే తీశారనిపిస్తుంది. దీంతో బాలయ్య సినిమా చూడడానికి వెళ్లిన మాస్ ప్రేక్షకులు అందరూ కాస్త పర్లేదులే అన్న ఫీలింగ్ తో బయటకు వస్తున్నారు. ఇక దర్శకుడు కథ విషయంలో మాత్రం కాస్త కొత్తగా ఆలోచించలేదు... బాలకృష్ణ రొటీన్ కథలు అన్నింటిని మిక్స్ చేసి పరమ రొటీన్ గా రూలర్ సినిమాను తెరకెక్కించాడని కాస్త సినిమా నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. దాంతో ఫస్టాఫ్ అవగానే ఫ్లాప్ అనే టాక్ వస్తోంది. ఇలా ఫస్టాఫ్ కే ప్రేక్షకులు డీలా పడిపోతే ఇక సెకండాఫ్ చూసే ఆసక్తి ఎక్కడుంటుంది.

 

ఈ విషయంలో బాలయ్య కంటే ఇక్కడ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ పొరపాటే ఎక్కువగా కనిపిస్తోంది. ఎంతో నమ్మితే బాలయ్యని డైరెక్టర్ ముంచేశాడని టాక్ మొదలైంది. గతంలో బాలకృష్ణ నటించిన లయన్ సినిమా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ రూలర్ సినిమా తో పోల్చుకుంటే కాస్తో కూస్తో లయాన్ సినిమానే బెటరన్న ఆలోచనకి వచ్చేశారు ప్రేక్షకులు. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలయ్య నటించిన పైసా వసూల్ లో కూడా ఎంతో కొత్తగా కనిపించాడు. కానీ పైసా వసూల్ సినిమా స్థాయిలో కూడా లేదన్న టాక్ రావడం చూస్తుంటే ఇక బాలకృష్ణ పని అయిపోయిందని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా బాలయ్య పోలీస్ గెటప్, మేకోవర్ అసలు సూటవలేదని బాలయ్య ఫ్యాన్సే నిర్మొహమాటంగా చెప్పుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: