పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకుంటే ఇలా చేస్తున్నారేంటి? పింక్ రీమేక్ విషయంలో ఇంకా ఎందుకీ డైలమా? చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూనే ఈ సినిమాలో ముఖ్య కథానాయకుడు పవన్ కల్యాణ్ అని ప్రకటించలేని పరిస్థితి ఎందుకు ఎదురవుతోంది?  ఈ డైలమా నుంచి నిర్మాత దిల్ రాజు బయట పడేది ఎప్పుడు? .. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ హాట్ గా నడుస్తున్న టాపిక్ ఇది. ఓవైపు పరిశ్రమ వర్గాల్లో.. మరోవైపు అభిమానుల్లోనూ ఇదే చర్చ జోరుగా సాగుతోంది.

 

ప్రస్తుతం పింక్ సినిమాకి సంబంధించి ప్రీప్రొడక్షన్ వర్క్ శరవేగంగా పూర్తవుతోంది. దర్శకుడు వేణు శ్రీరామ్ - థమన్ తో బాణీల పని పూర్తి చేస్తున్నారు. రికార్డింగ్ కార్యక్రమాలు వేగంగానే పూర్తవుతున్నారు. నటీనటుల ఎంపిక పూర్తయిపోతోంది. ఫలానా కథానాయికను ఎంపిక చేశారు అంటూ అప్పుడే ప్రచారం వేడెక్కిస్తోంది. ఇదంతా రీమేక్ విషయం ప్రకటించిన రెండు వారాల్లోనే. అయితే ఇంకా ఎందుకనో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు అన్న ప్రకటన శ్రీవెంకటేశ్వర కాంపౌండ్ నుంచి వెలువడలేదు. ఆ స్వేచ్ఛ దిల్ రాజు తీసుకోనూ లేదు. ఇదంతా చూస్తుంటే అసలు ఈ ప్రాజెక్ట్ లో పవన్ ఉంటాడా లేదా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

 

సరిగ్గా పవన్ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న ఈ టైమ్ లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఊహించని బాంబ్ పేల్చారు. ఏపీకి ఒకటి కాదు మూడు రాజధానులు! పాలనను వికేంద్రీకరిస్తున్నాం! అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు పంచుతున్నాం! అంటూ జగన్మోహన్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడంతో అది కాస్తా రాజకీయంగా వేడి పుట్టించింది. దీంతో పవన్ మళ్లీ జనసేన తరపున తన బాణిని వినిపించాల్సి వస్తోంది. మూడు రాజధానుల్ని వ్యతిరేకించడం పవన్ కి ముప్పుగా మారింది. అమరావతి వాసులు మినహా ఇతర అన్ని ప్రాంతాల్లోనూ జనసేనానిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి సందిగ్ధ పరిస్థితిలో పవన్ రాజకీయాలను పెట్టి సినిమాల్లోకి వెళతారా? అన్న మరో చర్చా సాగుతోంది. 

 

దీంతో నిర్మాత దిల్ రాజు పెద్ద ఇరకాటంలో పడ్డారు. ఉన్నఫలంగా పవన్ గనక డ్రాపయితే నా పరిస్థితేంటి అని దిల్ రాజు టెన్షన్ పడుతు బి.పి తెచ్చుకుంటున్నాడట. అందుకు కారణం ఇంతకుముందు కూడా జనసేన పార్టీ పెట్టే సమయంలో ఎన్నికల్లోకి ఎంటరయ్యో సమయంలో మైత్రి మూవీ మేకర్స్ కి పవన్ ఇలానే ఇబ్బందిని క్రియేట్ చేశారు. రేపో మాపో సెట్స్ కెళతారు అనుకున్నది అర్థాంతరంగా బ్రేక్ పడింది. మరి ఈసారి పవన్ అలా చేయరు కదా! అని సందేహిస్తున్నారు. మరి ఈ విషయంలో క్లారిటి వచ్చేదెప్పుడో దిల్ రాజు బి.పి తగ్గేదెప్పుడో..?  

మరింత సమాచారం తెలుసుకోండి: